గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో.. దిగువ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారింది.. గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలం అవుతున్నాయి పోలవరం ముంపు మండలాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు.. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోగా.. మరోవైపు గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది..…
* నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రీ బూస్టర్ డోసు * లార్డ్స్ వన్డేలో భారత్ పరాజయం, భారత్పై 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు * నేడు విశాఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన… ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. వాహన మిత్ర లబ్ధిదారులకు 4వ విడత నగదు బదిలీ చేయనున్న సీఎం. * విశాఖ పర్యటన అనంతరం రాజమండ్రికి చేరుకోనున్న సీఎం జగన్… వరద ముంపు…
ఓవైపు వరదలు ముంచెత్తుతున్నాయి.. మరోవైపు పెళ్లి ముహూర్తం ముంచుకొస్తుంది.. రోడ్డు మార్గంలో వెళ్లే పరిస్థితి లేదు.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే.. గోదావరి వదర భయపెడుతోంది.. ఆ సమయంలో.. పెళ్లి కూతురుకు, ఆమె బంధువులకు పడవే ఆధారంగా మారింది.. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో పెళ్లి కూతురిని పడవలో తీసుకెళ్లారు బంధువులు.. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు, వరదలు ఎక్కువగా ఉంటాయని భావించిన రెండు కుటుంబాలు.. ముందుగానే అంటే జులై నెలలో ముహూర్తం పెట్టుకున్నారు..…
జాతీయ స్థాయిలో విపక్షాలు కేంద్రంపై పోరాడుతూనే ఉన్నాయి.. కానీ, కొన్ని ప్రతిపక్షాలకు.. బీజేపీకి పెద్దగా తేడా లేదన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..