* తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ.. ఉదయం శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పణ.. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు * బాపట్ల జిల్లా: నేడు రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన కుటుంబాలను పరామర్శించనున్న టీడీపీ నేతలు.. మద్యం మరణాలపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన * నంద్యాల: నేడు ఆత్మకూరులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్న ఎమ్మెల్యే…
ఏపీ సీఎం జగన్పై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ పేరుతో పథకాన్ని అమలు చేశామని.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్…
ఉభయగోదావరి జిల్లాలలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కూనవరం బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై నుంచి గోదావరి పరుగులు తీస్తోంది. ఇప్పటికే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయగా.. ప్రజలు కాలినడకన బ్రిడ్జి దాటుతున్నారు. అటు గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. 24 గంటల పాటు గోదావరి ప్రవాహం.. వరద ముంపును మానిటర్ చేస్తోంది.…
హస్తిన వేదికగా ఆందోళనకు దిగారు కేఏ పాల్.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ ఢిల్లీలోని రాజ్ ఘాట్లో మౌనదీక్ష చేపట్టారు.. మధ్యాహ్నం 12 గంటలకు దీక్షకు దిగిన ఆయన.. మధ్యాహ్నం 3 గంటల వరకు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు.. తెలుగురాష్ట్రాల విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.. విభజన…
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నెలరోజులుగా టీడీపీ పనికిమాలిన చర్చ పెట్టిందని.. అదాన్ అనే కంపెనీ తనదేనని దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్తే నిజమై పోతుందని టీడీపీ నమ్మకమని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తన అల్లుడు కంపెనీకి చెందినవాడని ఆరోపిస్తున్నారని.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్…
గోదావరి పోటెత్తుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలు అల్లాడిపోతున్నాయి. దాదాపు లంక గ్రామాలన్నీ గోదావరి ప్రతాపానికి నీటమునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రిలీఫ్ ఆపరేషన్లో ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎన్ని ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు నెలకొన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 3వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది): అల్లూరి సీతారామరాజు జిల్లాలోని V.R పురం, కూనవరం గ్రామాలకు చెందిన 222 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు…
* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. మండపేటలో కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొననున్న పవన్ * ఏపీలో నేటి నుంచి ఆలయాల్లో ఏ ఖర్చుకైనా ఆడిట్ పూర్తవ్వకుండా బిల్లులు చెల్లించకూడదని ప్రభుత్వం నిర్ణయం * బాపట్ల జిల్లా: నేడు రేపల్లె మండలం పేటేరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ * రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద పోటెత్తుతున్న గోదావరి.. ఈరోజు వరద ప్రవాహం 25 లక్షల…
ఏపీ సీఐడీ నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు వరుస ఫోన్లు వెళ్తున్నాయి. ఫేక్ ట్వీట్ విషయంపై మంత్రి అంబటి రాంబాబుపై చేసిన ఫిర్యాదు అంశంలో ఉమ స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు సీఐడీ ఫోన్లు చేస్తోంది. అయితే రెండు రోజులుగా సీఐడీ తనకు వరుసగా ఫోన్లు చేస్తుండటంపై దేవినేని ఉమ అసహనం వ్యక్తం చేశారు. నిందితుడైన మంత్రి అంబటి రాంబాబును కాకుండా.. తన వెంట పడటమేంటని ఫోన్లోనే దేవినేని ఉమ సీఐడీ పోలీసులపై…