సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదరణ కోల్పోయ్యారంటు చంద్రబాబు చెప్పడం చూస్తూంటే ఆయనకి చిన్న మెడదు చితికిందా..? అనే అనుమానం కలుగుతోందన్నారు మంత్రి ఆర్కే రోజా
ఎగువ నుంచి భారీ వరదలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది.. లంక గ్రామాలను గోదావరి ముంచెత్తుతోంది.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు చేరింది నీటిమట్టం.. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.. బ్యారేజీ నుండి 15 లక్షల 21 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.. అయితే, గడిచిన 24 గంటలూగా గోదావరిలో అదే పరిస్థితి కొనసాగుతోంది.. అయితే, ధవళేశ్వరం దగ్గర 11.75 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ…
* తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల వర్షాలు, ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక. * బాపట్ల : చీరాల మండలం పాత చీరాలలో శ్రీ అద్దంకమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పొంగళ్ళ కార్యక్రమం.. * కోనసీమ జిల్లాలో 18 మండలాల్లోని 51 లంకలకు పొంచి ఉన్న వరద ముప్పు, ఇప్పటికే 31 గ్రామాలకు నిలిచిన రాకపోకలు, పి. గన్నవరం, మామిడికుదురు, అల్లవరం, ఐ పోలవరం, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం,…
తిరుమల కొండపై టీటీడీ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. నగదు చెల్లింపుల స్థానంలో యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేసే టీటీడీ దేశవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులు జరుగుతున్న వేళ తిరుమలలోనూ యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద భక్తుల వసతి గదుల కేటాయింపును టీటీడీ ఎంచుకుంది. Read Also: Polavaram Flood Effect: పోలవరంపై గోదారి వరద ప్రభావమెంత? వసతి గదుల కేటాయింపు సమయంలో భక్తులు…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రైతులకు ద్రోహం చేశారని.. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. వీరందరికీ తమ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా అని నిలదీశారు. ఈ…
వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఏపీ శాసనసభ వ్యవహారాల సమన్వయకర్తగా ఏపీ ప్రభుత్వం ఆయన్ను నియమించింది. అంతేకాకుండా ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్ల పాటు శ్రీకాంత్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ఇటీవల జరిగిన క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణలో శ్రీకాంత్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ జగన్ ఆయనకు బెర్త్ కేటాయించలేదు. ఇప్పుడు మాత్రం…
బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. అటు ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విలేజ్ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలని సీఎం…
రైతులకు ద్రోహం చేశారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. అమరావతిలో సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయి.. గత ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని పోయి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా?? వీరందరికీ మా ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా? అని నిలదీశారు.. దీనిపై దత్త పుత్రుడు…