రేప్ చేసినా రేపు రండి అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కనిపిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత.. ఎంపీ గోరంట్ల మాధవ్ ను వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా..? అంటూ ఫైర్ అయ్యారు.. రాజకీయ కుట్ర అని హోం మంత్రి ఎలా చెబుతారు..? వెకిలి వేషాలేస్తోన్న ఎంపీపై చర్యలు తీసుకోకుండా ఎంపీని వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా..? హోం మంత్రిగా ఎలా పని చేయాలో తెలియకుంటే ఇంట్లో కూర్చొవాలి.,. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత హోం మంత్రి బయటకొచ్చి కుట్ర అని మాట్లాడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అందుబాటులో ఎవ్వరూ లేరు.. పబ్లిక్ హాలిడే కాబట్టి.. పోలీసు ఉన్నతాధికారులు సెలవులో ఉన్నారట.. 24 గంటలు పని చేయాల్సిన పోలీసు శాఖ సెలవు తీసుకుందని ఎద్దేవా చేశారు.
Read Also: Amalapuram Incident: అమలాపురం అల్లర్లకు అసలు కారకులు సీఎం, డీజీపీకి తెలుసు..!
అంబటి రాంబాబు, అవంతి లాంటి వాళ్లపై చర్యలు తీసుకుని ఉంటే మాధవ్ న్యూడ్ ఎపిసోడ్‌పై ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చేది కాదన్నారు అనిత.. తప్పు చేసిన మాధవ్ ను ఆ పార్టీకి చెంది సహచర ఎంపీలే వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.. ఎంపీ మాధవ్ పొరంబోకు వేషాలు వేస్తున్నారని మండిపడ్డ ఆమె.. మహిళా జేఏసీ తరపున మాధవ్ న్యూడ్ వీడియో విషయమై ఎంపీలకు.. జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు అనిత.. అయితే, టీడీపీ విమర్శలపై ఘాటుగా స్పందించారు హోంమంత్రి తానేటి వనిత..ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళా నేతలు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో గమనించుకోవాలని హితవు పలికారు. ఆ మహిళానేతలు వాడే పదజాలం రాష్ట్రంలోని మహిళలందరూ సిగ్గుపడేలా ఉందని తానేటి వనిత విమర్శించారు. ఈ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్న ఆమె.. సీఎం జగన్ మూడేళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉండడం ఓర్వలేక ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలకు దిగుతున్నారని ఆరోపించారు. మాధవ్ అంశంలో వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అది నిజమని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు.