టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.. షిర్డీ సాయినాథునిపై ఆయన చేసిన వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణంగా మారాయి.. చంద్రగిరి మండలం రంగంపేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించారు. ఆ గుడికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు మోహన్ బాబు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గుడి దక్షిణాదిలోనే అతి పెద్దదని ఇదొక అద్భుతం. నా దృష్టిలో ఇక భక్తులు షిర్డీ సాయినాథుని…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.. వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరగా ఉండే ఆయన.. వైఎస్ జగన్ ఫస్ట్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.. జగన్ కేబినెట్ 2లో ఆయనకు చోటు దక్కలేదు.. దీంతో, ఆయన అలకబూనడం.. అధిష్టానం బుజ్జగించడం అన్నీ జరిగాయి.. ఇక, ఆ తర్వాత.. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్…
ఆడ, మగ మధ్యే కాదు.. ఇద్దరు మహిళల మధ్య కూడా ప్రేమలు ఉంటాయి.. కానీ, ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకునే ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి.. సమాజం ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకుంటూ అంగీకరించదు.. అయితే, కడప జిల్లాలో ఓ ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఓ యువకుడితో పెళ్లి జరిగిన తర్వాత.. వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. విడిపోయారు.. ఈ నేపథ్యంలో.. మరో యువతితో స్నేహం.. ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది…
పార్టీలో యువతకు ప్రాతినిధ్యంపై టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో చర్చ లేవనెత్తారు లోకేష్.. దీంతో, ఆయన సూచనలపై సమగ్ర అధ్యయననానికి కమిటీ ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.
* నేడు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం, రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనున్న నితీష్ * భారత ఉపరాష్ట్రపతిగా నేటితో ముగియనున్న వెంకయ్యనాయుడు పదవీకాలం, రేపు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ప్రమాణస్వీకారం * తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు, రేపటి నుంచి ఆర్జిత సేవలు పున:రుద్ధరణ * అల్లూరి సీతారామరాజు జిల్లా : నేడు విలీన మండలాల్లో కేంద్ర బృందం పర్యటన, రంప చోడవరం నియోజకవర్గంలోని చింతూరు, ఎటపాక,…
ఓవైపు గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో పాటు.. మరోవైపు.. కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది.. శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది.. దీంతో 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో 2,04,895 క్యూసెక్కుల నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుండగా.. 8 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఔట్ ఫ్లోగా 2,85,724 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా..…
ఈ నెల 11వ తేదీన పదవి విరమణ చేయనున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకంక్షలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వెంకయ్యనాయుడు రాజకీయ మేధావి, ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చిన నాయకుడు అని ప్రశంసించారు.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి, అత్యవసర పరిస్థితిని ఎదిరించారని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఆరు నెలలపాటు జైలు జీవితం మొదలుకుని ఇప్పటి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెంకయ్యనాయుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో…
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో.. మళ్లీ గోదావరిలో వరద పోటెత్తుతోంది.. ఇప్పటికే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ఈ రాత్రికి గోదావరిలో వరద ప్రవాహం 50 అడుగులను కూడా దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి.. జులైలో భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమై.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రాంతాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది… ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ విపత్తలు నిర్వహణ సంస్థ.. ఆరు జిల్లాలను అప్రమత్తం చేసింది.. ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల…
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది.. అధికార, ప్రతిపక్షాలు ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.. తాజాగా, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించడం చర్చగా మారింది.. అయితే, ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్… కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు తెలుగుదేశం…