Andhra Pradesh: రూ.81 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ పచ్చజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయన్నారు. ఈ పెట్టుబడుల వల్ల ఉద్యోగాలతో పాటు రైతులకు మేలు జరుగుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు ఏపీ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని.. భారీ సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
Read Also: Archana Gautham: తిరుపతి దేవస్థానంలో సినీ నటి రచ్చ.. తప్పుగా ప్రవర్తించారంటూ
Also Read
- NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
- Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
- Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
- BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుందని సీఎం జగన్ అన్నారు. దీనివల్ల వారికి ఆదాయాలు కూడా పెరుగుతాయని.. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయని అభిప్రాయపడ్డారు. వాటిద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని జగన్ తెలిపారు. అటు వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో కాసిస్ ఇ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌ఐపీబీ సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. రూ. 386.23 కోట్లను కంపెనీ పెట్టుబడిగా పెట్టనున్నది.ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. తొలివిడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వేయి ఎలక్ట్రిక్ బస్సులు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!