Vangalapudi Anitha: జాతీయ మహిళా కమిషన్‌కు టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత గురువారం నాడు ఓ లేఖ రాశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ సహా ఏపీలో పెద్ద ఎత్తున మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయని లేఖలో అనిత వివరించారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలని ఆమె కోరారు. మహిళలపై వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందంటూ లేఖలో స్పష్టం చేశారు. బాధిత మహిళల వివరాలను…
Annamayya District: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో ఓ అత్త అతి క్రూరంగా ప్రవర్తించింది. కోడలి తల నరికి.. ఆ తలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులకు లొంగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. కె.రామాపురంలో అత్త సుబ్బమ్మ, కోడలు వసుంధరకు కొంతకాలంగా పడటం లేదు. తరచూ కుటుంబంలో ఇద్దరికీ విభేదాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు మరోసారి అత్తాకోడళ్ల మధ్య వార్ చోటు చేసుకుంది. దీంతో…
గత నెలలో గోదావరి ముంపు దెబ్బ నుంచి ఇంకా సరిగా తేరుకోలేదు.. అప్పుడే మళ్లీ గోదారమ్మ విరుచుకుపడుతుంది.. ఆగస్టులో వర్షాలు, వరదలు ఉంటాయని జులైలో ముహూర్తాలు పెట్టుకున్నా.. కొన్ని పెళ్లిళ్లలకు ఇబ్బందులు తప్పలేదు.. ట్రాక్టర్లపై.. చివరకు పడవలపై మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లిళ్లు జరిపించిన ఘటనలు వెలుగు చూశాయి.. ఇప్పుడు.. గోదారమ్మ ముంపే కాదు.. ముహూర్తాలు కూడా ముంచుకొస్తున్నాయి.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఆ తంతు జరిపించడం లంక గ్రామాల వాసులకు సవాల్‌గా మారింది.. ఇళ్లు, గ్రామాలను…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది… అనంతపురంలో జరిగిన ఓ పెళ్లికి హాజరై ఆమె.. ఆ తర్వాత కర్నూలులో వైఎస్సార్ మిత్రుణ్ణి పరామర్శించేందుకు వెళ్లారు.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిన తర్వాత గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.. రెండు టైర్లు పేలి.. కారు అదుపుతప్పినా.. డ్రైవర్ చాకచక్యంతో ఈ ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది.. ఆ తర్వాత మరో…
గనన్న విద్యా దీవెన పథకం ద్వారా 694 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల అకౌంట్లలో వేస్తున్నామని తెలిపారు సీఎం జగన్.. రాఖీ పండుగ సందర్భంగా నా అక్క చెల్లెమ్మలకు అందిసున్న కానుక ఇది... మీ అన్నగా.. మీ తమ్ముడుగా నేను గర్వంగా చెబుతున్నా అన్నారు.
బాధితులు ఎవరూలేని ఘటనలో కూడా టీడీపీ ఆరోపణలు చేస్తోంది అంటూ ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బాధితులు ఎవరూ లేని ఘటనలో టీడీపీ ఆరోపిస్తుంది… గతంలో ఇలాంటి ఆరోపణలు వస్తే సీఎం జగన్ ఉపేక్షించలేదని గుర్తుచేశారు. గడిచిన వారం రోజులుగా ఇదే అంశాన్ని పట్టుకొని వేలాడుతున్నారని మండిపడ్డ ఆయన.. సమస్యల పై స్పందించకుండా ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్నారని విమర్శించారు. దిశా లాంటి చట్టాలను చేసి మహిళలకు రక్షణ కల్పిస్తుంటే…
నేను పార్టీ మారుతున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా కోవూరులో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ విజయమ్మ తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేను నేనే అన్నారు.. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో నేను పార్టీ మారుతున్నాని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో నేను తిట్టినంతగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు…
నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన సాగనుంది.. గత నెలలో వరదల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ, గృహ నష్టాలను పరిశీలించనుంది ఇంటర్ మినిస్ట్రీయల్ కేంద్ర బృందం.
జగనన్న విద్యా దీవెన నగదు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు బాపట్లలో పర్యటించనున్న ఆయన.. జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొంటారు..
* నేడు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ప్రమాణస్వీకారం * నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం, కేబినెట్ ముందుకు వర్సిటీల చట్ట సవరణ ముసాయిదా బిల్లు, అన్ని వర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్కు అనుకూలంగా చట్ట సవరణ, ఇప్పటికే కామన్ బోర్డు ఏర్పాటు చేసిన సర్కార్ * నేడు బాపట్లలో సీఎం జగన్ పర్యటన, జగనన్న విద్యాదీవెన పథకం మూడో త్రైమాసిక నిధులను విడుదల చెయ్యనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…