* నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన. అచ్యుతాపురంలో ఏటీజీ టైర్ల ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం జగన్. * నేటి నుంచి ఐదు రోజుల పాటు నెల్లారులో శ్రీవారి వైభవోత్సవాలు. * నేడు స్వాత్రంత్ర్య భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం. నేడు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన. రాష్ట్రమంతా ఒకే సమయంలో జాతీయగీతం పాడేలా ఏర్పాట్లు. అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గర పొల్గొన్ననున్న సీఎం కేసీఆర్. ఉదయం 11.30 గంటలకు కార్యక్రమం.. అన్ని ట్రాఫిక్ కూడళ్లో నిమిషం…
Gudivada Amarnath: అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అసలు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా అని పవన్ కళ్యాణ్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం కోసం జనసైనికులు…
National Lok Adalat: ఏపీ వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్పందన లభించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో శనివారం 380 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కరోజే ఏపీ వ్యాప్తంగా 94,263 కేసులు పరిష్కారం అయినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 87,805 పెండింగ్, 6,458 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నట్లు వివరించారు. ఆయా…
తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. లాంగ్ వీకెండ్ రావడంతో అందరూ ఒక్కసారిగా తిరుమలకు చేరుకున్నారు. దీంతో సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈనెల 21 వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్…
* 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియోతోపాటు దూరదర్శన్‌లో ఆమె ప్రసంగం ప్రసారం కానుంది. * విశాఖలో నేటి నుంచి ఈనెల 30 వరకు అగ్నివీర్ల నియామకానికి రంగం సిద్ధం.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిక్రూట్ మెంట్.. ఆన్ లైన్లో తొలిరోజే రిక్రూట్ మెంట్ కోసం అడ్మిట్ కార్డులు.. రాత్రే మున్సిపల్ స్టేడియానికి చేరుకున్న యువకులు.. స్టేడియం పరిసరాల్లోనే బస…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారం జాతీయ స్థాయి వరకు వెళ్లిన విషం తెలిసిందే.. అయితే, అది ఒరిజినల్ కాదు.. ఫేక్ అని అనంతపురం జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.. కానీ, ఇప్పుడు మాధన్ న్యూడ్ వీడియో కాల్ ఎపిసోడులో ఫోరెన్సిక్ నివేదికను బయటపెట్టింది టీడీపీ.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించిన నివేదికను…
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూర్ జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్ అంటూ మండిపడ్డారు.. రాష్ట్రంలో కొందరిని శూర్పణఖలను తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనంటూ ఎద్దేవా చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని ఎస్పీ విచారణలో తేలిందని స్పష్టం చేసిన మంత్రి.. అయినా, ఆ వ్యవహారంలో ఇంకా వివాదం…
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దిశగా చర్యలు చేపట్టాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… ఆజాదీ కా అమృత మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందన్నారు.. మహనీయులను స్మరించడం మానుకొని, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా సొంత ప్రచారం చేసుకుంటున్నారు.. ఇప్పటికైనా మానుకోవాలని సూచించిన ఆయన.. అనవసరమైన వాటికి రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని.. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి,…
కేంద్రంలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్… ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు చింతా మోహన్.. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చింతామోహన్ మాట్లాడుతూ.. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనని గుర్తుచేశారు.. నేడు దళితులు దేవాలయాలకు, విద్యాలయాలకు వెళ్తున్నారంటే కారణం కాంగ్రెస్…
టీటీడీపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి… తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. పాదయాత్రలో పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రులు టి. సుబ్బరామిరెడ్డి, చింతా మోహన్.. అంబేద్కర్ భవన్ వద్ద జరిగిన బహిరంగ సభలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. టీటీడీ పరిపాలను ప్రస్తుతం చాలా బాగుంది.. టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఎంత మంచి పాలన…