• తిరుమల: నేటి నుంచి 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
• నేడు, రేపు తిరుమలలో సీఎం జగన్ పర్యటన.. రాత్రి 7:45 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్.. నేడు అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్న సీఎం జగన్.. రేపు ఉదయం 6 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్.. స్వామి వారి దర్శనం తర్వాత పరకామణి భవనం ప్రారంభోత్సవం.. ఎంపీ వేమిరెడ్డి నిర్మించిన రెస్ట్ హౌస్‌ను ప్రారంభించనున్న జగన్
• అమరావతి: నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవ సంబరాల్లో పాల్గొననున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వేడుకలు.. ఉదయం 11 గంటలకు ప్రపంచ పర్యాటక దినోత్సవ సంబరాలు.. హాజరుకానున్న మంత్రి రోజా, శాప్ ఛైర్మన్, ఇతర ఉన్నతాధికారులు
అమరావతి: ఉ.11:30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పశు సంవర్ధక శాఖపై సీఎం జగన్ సమీక్ష.. హాజరు కానున్న మంత్రి సిదిరి అప్పలరాజు, ఇతర ఉన్నతాధికారులు
• ఢిల్లీ: నేడు కేంద్ర హోంశాఖ కీలక భేటీ.. అజెండాలో 14 అంశాలపై చర్చించనున్న కేంద్ర హోంశాఖ.. ఏపీ విభజన చట్టం అమలుపై ఉన్నతస్థాయి సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. ఇరు రాష్ట్రాలకు చెందిన ఏడు అంశాలపై ప్రధాన చర్చ
• హైదరాబాద్: నేడు నాంపల్లి కోర్టుకు నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న
• రాజన్న సిరిసిల్ల జిల్లా: నేడు సిరిసిల్ల పట్టణంలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
• ఢిల్లీ: నేటి నుంచి సుప్రీంకోర్టులో ప్రత్యక్ష ప్రసారం ద్వారా విచారణలు