* నేటి నుంచి భారత్ – దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. ఇవాళ తొలి టీ-20 మ్యాచ్, రాత్రి 7 గంటలకు తిరువనంతపురంలో మ్యాచ్
* నేడు 21వ రోజు కొనసాగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
* నేడు సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లా పర్యటన.. కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రాంకో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి
* హైదరాబాద్: నేడు మరోసారి ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి..
* విశాఖ: నేడు ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించనున్న రక్షణ శాఖ సలహాదారు, డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డా. జి సతీష్ రెడ్డి…. అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం
* అల్లూరి సీతారామ రాజు జిల్లా: నేటి నుంచి చింతపల్లి కేంద్రంగా ఫారెస్ట్ డివిజన్ కేంద్రం సేవలు ప్రారంభం.
* ఏలూరు జిల్లా: “అమరావతి టు అరసవల్లి”రైతుల మహాపాదయాత్రలో భాగంగా నేడు ఏలూరు వంగాయి గూడెం సెంటర్ నుంచి ప్రారంభం కానున్న యాత్ర.
* తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రోండో రోజు.. ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై.. రాత్రి 7 గంటలకు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మూడో రోజుకి చేరుకున్న దేవినవరాత్రులు.. నేడు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.. తెల్లవారు జామున 3 గంటల నుండే ప్రారంభమైన దర్శనాలు.
* విశాఖ: శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, వైష్ణవీ దేవి అవతారంలో రాజశ్యామల అమ్మవారి దర్శనం
* నేడు శ్రీశైలంలో మూడోవరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, సాయంత్రం చంద్రఘంట అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, రావణవాహనంపై ఆశీనులై పూజలందుకొనున్న ఆది దంపతులు, క్షేత్ర పురవీధుల్లో కన్నులపండువగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం
* నంద్యాల: మహానందిలో దసరా వేడుకలు, నేడు రుద్ర, చండి యాగాలు.. చంద్ర ఘంట అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న కామేశ్వరి దేవి అమ్మవారు
* వరంగల్: శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాలు, మూడవ రోజు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనం.. అమ్మవారికి ఉదయం సింహ వాహన సేవ, సాయంత్రం గజ వాహన సేవ.
* సంగారెడ్డి జిల్లాలో ముగిసిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర, నేడు మెదక్ జిల్లాలోకి ప్రవేశించనున్న యాత్ర, నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర, నర్సాపూర్ మండలాల్లో కొనసాగనున్న యాత్ర, సాయంత్రం నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బహిరంగ సభ
* భద్రాద్రి: నేడు భద్రాచలం రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో గజలక్ష్మి అవతారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు