MLA Kethireddy: అనంతపురం జిల్లా ధర్మపురం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను చెప్పుతో కొడతానని హెచ్చరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వాయిస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన నియోజకవర్గంలోని పలు వార్డుల్లో వాలంటీర్లు పెన్షన్ సొమ్ము ఇవ్వడంలో కరప్షన్‌కు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. వార్డుల్లో వాలంటీర్ల ద్వారా కరప్షన్ చేయమని చెప్పేసి, చేస్తున్నారని.. ఎవడైనా జనం దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిస్తే ఒక్కొక్కడిని నడిరోడ్డుపై చెప్పుతో కొడతానని ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు. మర్యాదగా జనాల వద్దకు వెళ్లి డబ్బులు ఇచ్చి రావాలని స్పష్టం చేశారు.
Read Also: Fertility Rate: దేశంలో భారీగా తగ్గిన సంతానోత్పత్తి.. గత పదేళ్లలో 20% డౌన్
అటు కౌన్సిలర్లకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పంపిన వాయిస్ రికార్డులో మనవాళ్లు.. ఒకట్రెండు చోట్ల చెయ్యి చూపుతున్నారని.. దానికంటే దరిద్రం లేదన్నారు. దయచేసి ఇది మరోసారి రిపీట్ చేయవద్దని సూచించారు. ఒకవేళ చేస్తే క్రిమినల్ కేసులు పెట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. జీవితంలో ఎప్పుడూ తేరుకోలేని విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం వాలంటీర్లపై ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.