ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారాయన.. 27 మందిలో ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఉన్నారని.. మిగిలిన వారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు.. ముఖ్యంగా.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175కి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సరిగా పాల్గొనని ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు సీఎం జగన్.. అయితే, ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు సమీక్ష చేసుకోవటం సహజం.. దానిలో భాగంగా కనీసం 16 రోజులు కూడా తిరగని వారి పేర్లు సీఎం జగన్ చెప్పారు… దాన్లో తప్పేం ఉంది? అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. కానీ, దీనిని సీఎం జగన్ ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు అనడం కరెక్ట్ కాదని సూచించారు.
Read Also: Biryani: ఓల్డ్ సిటీలో బిర్యానీ ఫైట్.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్..
ప్రతీ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం కరెక్ట్ కాదని హితవుపలికారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వచ్చే ఎన్నికల్లో చరిత్ర తిరగ రాస్తాం.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో విజయం సాధించటమే మా పార్టీ లక్ష్యం, విధానం అని స్పష్టం చేశారు.. అందరికీ వారసులు ఉంటారు… మేం అనుకోవడం కాదు… ప్రజలు కోరుకోవాలన్న ఆయన.. రాష్ట్రంలో పనికి మాలిన ప్రతిపక్షం ఎందుకు? టీడీపీ లాంటి దోచుకునే ప్రతిపక్షాన్ని ప్రజలు ఎందుకు కోరుకుంటారు? అంటూ మండిపడ్డారు.. ఇక, ప్రజల ఆమోదం ఉంటేనే ఎవరైనా గెలుస్తారు.. ఏ పార్టీ అయినా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తుందన్నారు మంత్రి బొత్స.