డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40 శాతం పురోగతి సాధించాం అన్నారు.. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానల్స్ గాను, ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానల్స్ పూర్తి చేయడం జరిగింది. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా, డివాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్ కు పూర్తి చేస్తాం అన్నారు..
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు యూరియా కొరత ఏర్పడిందని.. ఏపీకి 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినా రైతులకు యూరియా అందడం లేదని.. యూరియా అనేక చోట్ల దాచిపెడుతున్నారు అని ఆరోపించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని చూస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిను ములాఖత్ లో కలిశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఈ సందర్భంగా ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టులో ఆర్డర్ ఇచ్చినా అన్నింటిలో వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తుందన్నారు.. మిథున్‌రెడ్డిని జైలులో టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారు అని మండిపడ్డారు..
ఏలూరులో సీబీఐ వలకు చిక్కాడు విజయవాడకు చెందిన ఐటీ ఇన్స్పెక్టర్.. ఏలూరులోని ఓ మొబైల్ షాపు యజమాని నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా అధికారులకు ఫిర్యాదు చేశారు.. దీంతో, సీబీఐ వలవేసి ఆ అధికారిని పట్టుకుంది.. కాగా, ఏలూరు రామచంద్రరావుపేటలో ఉన్న సెల్‌ఫోన్ సర్వీస్ షాపు యజమానిపై విజయవాడలోని ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ కార్యాలయానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి..
రాయచోటిలో జరిగిన ఓ సంఘటన గుండెల్ని పిండేస్తోంది. కన్నతండ్రే బిడ్డల జీవితాలు నాశనమయ్యేందుకు కారణమయ్యాడు. ఆత్మహత్య చేసుకునేంతవరకు తీసుకెళ్లాడా దుర్మార్గుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయచోటికి చెందిన హుస్సేన్ దినసరి కూలీ. అతడికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ రూపకల్పన, నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించగా.. కీలకమైన అలైన్మెంట్ అభ్యంతరాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫస్ట్ ఫేజ్ కింద 46.63కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరగనుండగా ఇందులో 20కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆసియాలోనే పొడవైన ఎలివేటెడ్ మెట్రోగా గుర్తింపు లభిస్తుంది.