ఆదివాసి సంక్షేమమే కూటమి లక్ష్యం అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్... అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు, వెన్నెలకంటి రాఘవయ్య వంటి మహాపురుషుల సేవలను గుర్తించాలన్నారు.. సీఎం చంద్రబాబు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆదివాసీలకు గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
పండుగ పూట కొన్ని విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో తన చెల్లి వద్దకు రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ.. అనంత లోకాలకు చేరాడు ఓ యువకుడు..
ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్పై మరోసారి ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, బెంగళూరులోని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు..
శ్రీశైలం డ్యామ్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి.. అయితే, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. శ్రీశైలాం జలాశయం వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై సున్నిపెంట పోలీసులు చర్యలు చేపట్టారు..
కడప జిల్లాలో జరుగుతోన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. పులివెందులలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.. గత ప్రభుత్వం పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని దీంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు..
గుట్కా ప్యాకెట్ల వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్పై జనసేన నేత దాడి చేయడం కలకలం సృష్టించింది.. నంద్యాలలో ఈ ఘటన జరిగింది.. జిల్లా ఎస్పీ స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మణిని చితకబాదారు జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ పిడతల సుధాకర్..
Minister Anitha: రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైళ్లశాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టింది.
CPI Narayana: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కటాక్షం లేకుంటే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు వెళ్లకుండా బయట ఉండటం సాధ్యం కాదన్నారు.