నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఊరట దక్కింది.. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది NCLT.. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అదానీ గ్రూప్‌కు కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అదానీ గ్రూప్ కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో అదాని గ్రూప్‌నకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఇచ్చింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అయితే, గిరిజనులకు దక్కాల్సిన ప్లాంట్లు అదానీ గ్రూప్ కు ఇవ్వడంతో వెనక్కు తీసుకుంది కూటమి సర్కార్..
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉదయం 10.30 గంటలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో భేటీకానున్నారు.. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో చర్చించనున్న వైఎస్ జగన్..
అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు.
సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండు రోజుల పాటు కీలక సమావేశాలు, చర్చల్లో పాల్గొన్న ఆయన.. మూడు రోజు సింగపూర్ అధ్యక్షుడు, మంత్రులు, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. ముఖ్యంగా నేడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు..
నాకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాకు పదవులపై ఆశ లేదు.. కానీ, జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు ఇష్టం అన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదు... జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు..
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎంపీ మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలులో నా కుమారుడిని టెర్రరిస్టుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిశారు ఆయన కుటుంబ సభ్యులు.. అందులో మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత, చెల్లి శక్తి రెడ్డి, బావ అఖిల్ ఉన్నారు.. ములాఖాత్ తర్వాత మీడియాతో మాట్లాడిన మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత.. సెంట్రల్ జైలులో తన కుమారుడికి కనీస…