ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తా.. పులివెందుల ఎన్నికపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
స్త్రీ శక్తి పథకం యొక్క మొదటి లబ్ధిదారులుగా ఉమ, కృష్ణవేణి లను గౌరవించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడ బిడ్డలకు మహర్దశ వచ్చే వరకూ అండగా ఉంటాం.. స్వర్ణాంధ్ర 2047 ఆనందం, ఆరోగ్యం, ఆదాయం ఉండాలని తీసుకొచ్చాం.. ఆడబిడ్డలకు మంచి చేయడం నా పూర్వజన్మ సుకృతం.. ఆగష్టు 15న స్త్రీ శక్తి ప్రారంభించడానికి కారణం మహిళల స్వాతంత్ర్యం.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా వెళ్ళే అధికారం మహిళలకు ఇచ్చాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్.. అని గర్వంగా చెపుతున్నా.. నేను, పవన్, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి లేదని చెప్పారు పవన్ కళ్యాణ్.. గత ఐదేళ్ళలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డలను అవమానించిన అంశంలో నేను, పవన్ బాధితులమే.. క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేసినా వదిలిపెట్టాం.. ఎవరైనా తోక తిప్పితే తోక కట్ అయిపోతుంది.. ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తేవడానికి వెనుకాడం అన్నారు. ఆడబిడ్డలపై గతంలో తలిదండ్రులు కూడా వివక్ష చూపించేవారు.. భర్తకు పర్మిషన్ అక్కర్లేదు.. భార్యకు పర్మిషన్ కావాలి.. ఇదేక్కడి న్యాయం అని పేర్కొన్నారు. కడుపున పుట్టిన పిల్లలూ ఆడవారికి ఏమీ తెలీదనే వారు.. అవి చూసి పుట్టిన ఆలోచనే డ్వాక్రా సంఘాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం.. ఫ్రీ బస్సుపై పవన్ కీలక వ్యాఖ్యలు
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. బలమైన అకుంఠిత దీక్ష ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు.. మన రాష్ట్ర ఆడపడుచులకు ప్రత్యేక ధన్యవాదాలు.. కూటమి ప్రభుత్వం నేటి నుంచి మహిళలకు, బాలికలకు, ట్రాన్స్ జెండర్ల కోసం ఈ పథకం అమలు చేస్తోంది.. కనీసం రూ. 2000 కోట్లు ఏడాదికి ఖర్చు చేసి ఈ పథకం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 8, 458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి.. నిర్ణీత ఐడీ చూపించి 5 రకాల బస్సులలో స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే, ప్రతీ బస్సులోనూ సీసీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. ఉండవల్లి నుంచి వస్తుంటే మహిళలతో మాట్లాడుతుంటే రూ. 1500 నుంచి 2 వేల రూపాయల వరకూ పొదుపు అవుతుందని చెపుతున్నారు.. పథకాలు ముందుకు తీసుకెళ్ళడానికి మాపై ప్రజలు పెట్టిన భరోసా కారణం.. ఆ భరోసానే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం తెచ్చింది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్, అమరావతికి నిధులు రావడానికి మార్గ నిర్దేశకత్వం చేసిన మోడీ, చంద్రబాబుకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.
సూపర్ సిక్స్, సూపర్ ప్లాప్.. చంద్రబాబుపై అంబటి ఫైర్
సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం అయినా మాపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందట.. ఇంత వరకు అంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండదు.. అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే గ్రామాల్లోకి వెళ్ళి సిరా చుక్కలు చూపించాలి.. వాళ్ళు విడుదల చేసిన ఫోటోల్లోనే జమ్మలమడుగు మార్కెట్ యార్డు చైర్మన్ ఓటు వేయటానికి క్యూలైన్లో ఉన్నారు.. దౌర్భాగ్యమైన పాలన చేస్తూ మాపై అభాండాలు వేస్తున్నారు.. చంద్రబాబుకు ఆయన చెల్లెళ్ళు రాఖీ కట్టిన సందర్భం ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇక, లోకేష్ కోతలు కోయటమే కానీ మీ ఇంటి గృహ శంకుస్థాపనకు మీ మేనత్తలను పిలిచారా అని మాజీమంత్రి అంబటి రాంబాబు అడిగారు. కాస్త చూసుకుని మాట్లాడండి లోకేష్.. మీ నాన్న మీ బాబాయిని ఎలా చూశారో అందరు చూశారు.. ఎన్నికల తర్వాత 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు నిజాయితీగా ఎన్నికలు చేస్తే పోలైన ఓట్లకు.. కౌంటింగ్ చేసిన ఓట్లకు 12.5 శాతం ఓట్లు పెరిగాయో పవన్ చెప్పాలి.. చంద్రబాబు, రేవంత్, రాహుల్ హాట్ లైన్ లో ఉన్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కరెక్ట్.. చంద్రబాబు ఎప్పుడూ ఏ అవతారం అయినా ఎత్తుతారు.. ఇక సిద్ధాంతం, నిబద్ధత లేని వ్యక్తి చంద్రబాబు.. ఆయనకు అవసరం అయితే బీజేపీకి వెళ్తాడు.. అటు నుంచి కాంగ్రెస్ అంటారు.. మల్లీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వస్తారు.. ఎప్పుడు ఎటైనా తిరుగుతారని అంబటి రాంబాబు విమర్శించారు.
“మర్వాడీ గో బ్యాక్” అంశంపై స్పందించిన బండి సంజయ్.. ఏమన్నారంటే..?
మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు. తెలంగాణను దోచుకోలేదు. వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారు. జీడీపీని పెంపులో వారి పాత్ర చాలా ఉంది. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు. అట్లాంటి మర్వాడీలు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలి?’’ అని ప్రశ్నించారు. మర్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని అన్నారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మర్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే… బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వృత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి..
పార్టీ మార్పుపై ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానని వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తనపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. గువ్వల బాలరాజును తానే పంపించానని మరికొందరి ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళ్తానన్నది అవాస్తవమన్నారు. బీజేపీ తనపై ఎన్ని కుట్రలు చేసిన వారికి లోంగలేదని స్పష్టం చేశారు. సొంత లాభంకన్న తాండురు అభివృద్ధి ముఖ్యమన్నారు. బీఆర్ఎస్‌లో స్తెనికుడిలా పనిచేస్తానని చెప్పారు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవెర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులతో స్థానిక సంస్థల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆ షాక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తేరుకోక ముందే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కారు పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.
క్లౌడ్ పార్టికల్ స్కామ్.. ఈడీ రైడ్స్‌లో కోట్లల్లో ఆస్తులు సీజ్..
క్లౌడ్ పార్టికల్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడి నిర్వహించి సంచలనం సృష్టించింది. వ్యూనౌ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దాని అనుబంధ వ్యక్తులపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారుల బృందం పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని 10 ప్రదేశాలలో ఒకే సమయంలో దాడులు నిర్వహించింది. ఈక్రమంలో ఈడీ రూ.73.72 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు, పంజాబ్ పోలీసులు దాఖలు చేసిన FIRల ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేస్తుంది. వ్యూనౌ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ డైరెక్టర్ రాహుల్ ఆనంద్ భార్గవ, గ్రూప్ CEO, వ్యవస్థాపకుడు సుఖ్‌విందర్ సింగ్ ఖరూర్‌తో పాటు అనేక మంది నిందితులను కేసు విచారణలో భాగంగా ఈడీ ప్రశ్నిస్తోంది. సుఖ్వీందర్ సింగ్ ఖరూర్, అతని సహచరులు కలిసి వేల కోట్ల రూపాయల ‘క్లౌడ్ పార్టికల్ స్కామ్’కు పాల్పడ్డారని ఈడీ తన దర్యాప్తులో తేలిపింది. సేల్-అండ్-లీజ్‌బ్యాక్ (SLB) మోడల్ ఆధారంగా రూపొందించబడిన ఈ పథకం చాలావరకు కల్పితమైనదని పేర్కొంది. వ్యూనౌ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీకి క్లౌడ్ పార్టికల్స్ అద్దెకు తీసుకోవడానికి నిజమైన క్లయింట్లు లేరని, ఏ డేటా సెంటర్ క్లయింట్ నుంచి కూడా అది ఎటువంటి అద్దెను పొందలేదని స్పష్టం చేశారు.
పుతిన్ ముందు ట్రంప్ జుజుబీ.. ఐదుగురు అమెరికన్ అధ్యక్షులను కలిసిన రష్యా బాస్…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై చర్చించడానికి రెండు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. అయితే పుతిన్‌కు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతం ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. ట్రంప్ ఏడవసారి మాత్రమే అధ్యక్షుడు పుతిన్‌ను కలవబోతున్నారు. కానీ.. పుతిన్ మాత్రం తన హయాంలో ఐదుగురు అమెరికా అధ్యక్షులతో 48 సార్లు సమావేశమయ్యాయి. ట్రంప్-పుతిన్ మధ్య అనుభవ వ్యత్యాసం చాలా ఉంది. పుతిన్ కలిసిన ఐదుగురు అమెరికా అధ్యక్షుల్లో బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ. బుష్, బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్ ఉన్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన పుతిన్, అమెరికన్ అధ్యక్షుల మధ్య సమావేశాలు 2025 వరకు కొనసాగుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలల అనంతరం.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను మాస్కోలో కలిశారు. రష్యా దేశాధినేత క్లింటన్‌ను క్రెమ్లిన్ (రష్యన్ ప్రభుత్వ కార్యాలయం) పర్యటనకు పంపడమే కాకుండా, వారిద్దరి ముందు ఒక రష్యన్ జాజ్ బృందం కార్యక్రమాన్ని ప్రదర్శించింది.
వాళ్ల బండారం బయటపెడుతా.. యాంకర్లపై ఫైర్
ఈ మధ్య యాంకర్ ఉదయభాను బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో తన అవకాశాలపై రీసెంట్ గా చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఇండస్ట్రీలో యాంకర్లు కొందరు సిండికేట్ అయిపోయారని బాంబు పేల్చింది. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ త్రిబాణధారి బార్బరిక్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని యాంకరింగ్ అవకాశాలపై మాట్లాడింది. నేను ఆ రోజు మాట్లాడింది జోక్ గానే. కానీ అదే నిజం. ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయి. నన్ను తొక్కేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నాకు పెద్దగా ఎంకరేజ్ మెంట్ లేదు అంటూ చెప్పింది. ఇండస్ట్రీలో సిండికేట్ అయిపోయారు. ఒక్కోసారి కొన్ని ఈవెంట్లకు నా డేట్లు తీసుకున్న తర్వాత షో కోసం అక్కడకు వెళ్లాక నన్ను వద్దని చెప్పేవాళ్లు. ఉదయభాను ఒక షో చేస్తోంది అంటే ఆమెను ఎందుకు తీసుకున్నారు అనే వాళ్లే ఎక్కువ. అప్పటికప్పుడు సడెన్ గా నన్ను తీసేసేవాళ్లు. ఎన్నో బాధలు పడ్డాను. చిన్న షోలు చేస్తే నా కంటే చిన్న యాంకర్లకు అవకాశాలు రాకుండా పోతాయి. అందుకే ఏది పడితే అది చేయట్లేదు. త్వరలోనే నేను అన్నీ బయటపెడుతాను. ఎందుకంటే తర్వాత వచ్చే వాళ్లకు తెలియాలి కదా అంటూ సంచలన కామెంట్లు చేసింది ఉదయభాను. దీంతో ఆమె మాటలు ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఆకట్టుకుంటున్న కానిస్టేబుల్ కనకం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వర్షబొల్లమ్మ మెయిన్ లీడ్ లో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఆగస్టు 14 మధ్య రాత్రి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ను ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేయగా.. సీనియర్ ప్రొడ్యూసర్ కోవెలమూడి సాయి బాబా గారు, హేమంత్ కుమార్ నిర్మించారు. మేఘలేఖ, రాజీవ్ కనకాల కీలక పాత్రలు చేశారు. ట్రైలర్ తో మంచి అంచనాలు రేపిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీకాకుళం అడవి ప్రాంతంలో జరిగే మిస్టరీల చుట్టూ ఇది తిరుగుతుంది. అక్కడ వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోతారు. అలాంటి టైమ్ లో అక్కడ కానిస్టేబుల్ గా జాయిన్ అయిన కానిస్టేబుల్ కనకం.. ఈ మిస్టరీలను ఎలా ఛేదించింది.. ఆమెకు ఎదురైన అనుభవాలు ఏంటి అనేది థ్రిల్లర్ హర్రర్ సస్పెన్స్ ను తలపించేలా తెరకెక్కించారు. ఈ కథ అంతా పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ లోనే సాగుతుంది. నాలుగో ఎపిసోడ్ నుంచి కథ రసవత్తరంగా మారుతుంది. దర్శకుడు ప్రశాంత్ దిమ్మల పాత్రలను, కథను పరిచయం చేయడంలో కొంత టైమ్ తీసుకున్నా.. ప్రేక్షకులను కథలో లీనం చేయగలిగాడు. వర్ష బొల్లమ్మ అమాయకమైన కానిస్టేబుల్‌గా కనిపిస్తూనే.. సీరియస్ సీన్లలో చురుగ్గా కనిపిస్తుంది. మేఘలేఖ, రాజీవ్ కనకాలకు ఇచ్చిన కీలక పాత్రలకు న్యాయం చేశారు. అలాగే అవసరాల శ్రీనివాస్ ఊరి ప్రెసిడెంట్ గా ఒక వికలాంగుడి పాత్రలో మెప్పించారు. DOP శ్రీరామ్, BGMతో సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్‌లో మాధవ్ గుళ్లపల్లి ఆకట్టుకున్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం.. శ్రీలంక క్రికెటర్‌పై ఐసీసీ ఫైర్.. ఏకంగా ఐదేళ్లు!
శ్రీలంక మాజీ దేశీయ క్రికెటర్ సలియా సమన్ పై ఐసీసీ అవినీతి నిరోధక ట్రైబ్యునల్ 5 ఏళ్ల నిషేధాన్ని విధించింది. అబుదాబి T10 లీగ్ 2021లో మ్యాచ్‌లను అవినీతికి గురిచేయడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించి, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలడంతో ఈ శిక్ష విధించబడింది. ఐసీసీ ప్రకారం సెప్టెంబర్ 13, 2023న సమన్‌కు తాత్కాలిక నిషేధం విధించబడింది. ఈ నిషేధం ఆ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది. ట్రైబ్యునల్ సమన్‌పై ఆర్టికల్ 2.1.1గా అబుదాబి T10 2021లో మ్యాచ్‌లు లేదా మ్యాచ్‌లలోని అంశాలను తప్పుడు పద్ధతిలో ప్రభావితం చేయడానికి యత్నించడం, అలాగే ఆర్టికల్ 2.1.3గా ఇతర ఆటగాడికి అవినీతిపూరిత ప్రవర్తన చేయడానికి బహుమతి ఆఫర్ చేయడం, ఇంకా ఆర్టికల్ 2.1.4గా కోడ్ ఉల్లంఘన చేయడానికి ఇతర ఆటగాడిని నేరుగా లేదా పరోక్షంగా ప్రోత్సహించడం, ప్రేరేపించడం, లేదా సహకరించడం వంటి ఉల్లంఘనలు నిర్ధారించింది.