Students Protest: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఐనవోలు విట్ యూనివర్సిటీలో విద్యార్థినులు హాస్టల్ భోజనం బాగాలేదని రోడ్డెక్కారు. హాస్టల్‌లో అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యత లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. భోజనం బాగోలేదనే సమస్యను ఎప్పటి నుంచో యాజమాన్యానికి తెలియజేస్తున్నాం.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అలాగే, క్యాంటీన్‌లో కాలం చెల్లిన తినుబండారాలు అమ్ముతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Also: Alia Bhatt: అడల్ట్ మూవీలో అలియా భట్
ఇక, ఆందోళన చేస్తున్న తమపై యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తోందని విద్యార్థినులు వాపోయారు. తమ సమస్యపై ధర్నా చేస్తామని రిజిస్టార్ జగదీష్‌కు నేరుగా చెప్పాం.. అయితే, నిరసన చేస్తే ఊరుకోబోమని ఆయన బెదిరించాడని ఆరోపించారు. ఈ ఘటనపై యాజమాన్యం స్పందన కోసం తాము ఎదురు చూస్తుండగా, సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థినులు హెచ్చరించారు.