తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది టీటీడీ.. ఈ ప్రయోగం ఇవాళ్టి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సిట్ టీమ్ ముంబై వెళ్లింది.. షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)..
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.. సంజయ్ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.. ఏపీ హై కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది సుప్రీంకోర్టు.. గత ప్రభుత్వంలో అగ్ని మాపక శాఖలో ఎన్వోసీ ఆన్ లైన్ లో జారీకి సంబంధించి.. కాంటాక్ట్ విషయంలో సంజయ్ పై కేసు నమోదు అయింది..
విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వంగర మండలం బాగెంపేటలో గత నాలుగు రోజుల క్రితం శంకర్రావు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చోరీ జరిగింది.. ఈ ఘటనలో 20 తులాల బంగారం అపహరణకు గురైంది.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక పరిస్థితులు మెల్లిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే... రకరకాల విశ్లేషణలు జరిగాయి. అయితే... ఓవరాల్గా ఆయన టీడీపీని వ్యతిరేకించే వ్యక్తి కాదని, కూటమి ప్రయాణం కూడా సాఫీగానే సాగుతుందని లెక్కలేశారు. అయితే... టైం గడిచేకొద్దీ.... ఆయన స్వరం సవరించుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.
నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు కాకాణి గోవర్ధన్రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుండగా.. హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు.. నల్లపురెడ్డి కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. కార్యకర్తలు దూసుకురాగా.. వైసీపీ కార్యకర్తల మీద లాఠిఛార్జ్ చేశారు పోలీసులు.. దీంతో, రోడ్డుమీద బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..