వంగవీటి రంగాపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
విజయవాడలో నున్న సెంటర్‌లో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, వంగవీటి రాధా పాల్గొన్నారు. వీళ్ల ముగ్గురూ ఒకే వేదికపైకి రావడంతో రాజకీయంగా ఆసక్తి రేగింది. ఈ సందర్భంగా వంగవీటి రంగాపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసమే రంగా జీవించారని.. నమ్మిన సిద్దాంతం కోసం రంగా ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ప్రజల గుండెల్లో రంగా ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారని కొడాలి నాని కొనియాడారు. 1983లో టీడీపీలో రంగా శత్రువులు చేరారని.. రంగాను భూమి మీద లేకుండా చేయాలనే కుట్ర పన్ని.. హత్య చేశారని ఆరోపించారు. రంగాను హతమార్చిన దుర్మార్గులు ఎంత దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసన్నారు. కుటుంబం కోసం.. డబ్బు కోసం ఆలోచించకుండా రాధా ఓ చిన్న కుటీరం వేసుకుని ఉంటున్నారని కొడాలి నాని అన్నారు. రాధా అడిగితే.. వేయి ఇళ్లు ఖాళీ చేసి ఇస్తారని.. కానీ రాధాకు స్వార్ధం లేదన్నారు. తండ్రి పేరు నిలబెట్టడమే తనకు ముఖ్యమని రాధా అంటారని.. డబ్బులిస్తామన్నా.. రాజ్యసభ లాంటి పదవులిస్తామన్నా వంగవీటి రాధా లొంగడని కొడాలి నాని స్పష్టం చేశారు.
గుడివాడలో ఉద్రిక్తత.. రావి వర్సెస్ కొడాలి నాని
గుడివాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వ్యాపార సంస్థపై దాడి జరిగింది. రావి టెక్స్ టైల్స్ పైన దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు. కొడాలి నాని అనచరులేనంటున్నారు టోన్న టీడీపీ నేతలు. రావి వ్యక్తి గత ఫోన్ నెంబర్ కు కాల్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడిన కాళీ అనే వ్యక్తి. పెట్రోల్ సంచులతో టీడీపీ నేతలపై దాడికి యత్నంచిన పలువురు దుండగులు. రేపు వంగవీటి మోహన రంగ వర్ధంతి కార్యక్రమాలు ఎలా చేస్తారని రావికు ప్రశ్నలు సంధించిన అగంతకులు. కాళీ ఇంటికి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు. రావి నాయకత్వంలో వర్ధంతి కార్యక్రమాలు చేస్తాం, దమ్ముంటే అడ్డుకోవాలని నాని అనుచరులకు సవాల్. దీంతో గుడివాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ నేతల పోటా పోటీ నినాదాలతో ఉత్కంఠ నెలకొంది. జై రావి వెంకటేశ్వర రావు, జై కొడాలి నాని అంటూ రోడ్డుకు ఇరు వైపుల నినాదాలు హోరెత్తుతున్నాయి.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అని అన్నారు మంత్రి హరీష్ రావు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని CSI చర్చిలో జరుగుతున్న వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. ముందుగా ప్రతి ఒక్కరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..దేశంలో క్రిస్మస్ పండుగకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం హోదాలో క్రైస్తవ సోదరులకు విందు ఏర్పాటు చేసి సాంప్రదాయాలను గౌరవించిన నాయకుడు కేసీఆర్ అన్నారు.ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒకే దగ్గర అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటున్న గొప్ప దేశం మన భారతదేశం అన్నారు. దేశ సమగ్రతను సౌభ్రాతృత్వం కాపాడుతూ అభివృద్ధి లో ముందుకు సాగాలన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా పేదలకు సహాయం చేయడమే మన మొదటి ధ్యేయం అని సీఎం కేసీఆర్ ఎప్పటికీ చెబుతారని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 7 చర్చిలకు నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నేపాల్ ప్రధానిగా ప్రచండ.. ముగిసిన సంక్షోభం
నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్(ప్రచండ) నియమితులయ్యారు. మూడో సారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు ప్రచండ. నేపాలీ కాంగ్రెస్ పార్టీలో సంకీర్ణంలో ఉన్న ప్రచండ, తన పార్టీ అయిన సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న షేర్ బహదూర్ దేవుబా తన పదవని కోల్పోనున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్ధాం అని అనుకున్న నేపాలీ కాంగ్రెస్-మావోయిస్టు సెంటర్ మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మద్దతుతో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అధ్యక్షురాలు బిద్యా దేవీ భండారీ ఆదివారం పుష్పకమల్ దహల్ ను ప్రధానిగా నియమించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం ప్రచండ నేపాల్ ప్రధానిగా నియమితులవుతున్నట్లు నేపాల్ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఈ ఆర్టికల్ ప్రకారం రెండు లేదా అంతకన్నా పార్టీల మద్దతుతో పార్లమెంట్ లో మెజారిటీ సాధిస్తే ఆ పార్టీల్లోని ఎన్నుకోబడిన ఏ అభ్యర్థి అయిన ప్రధానిగా బాధ్యతలు చేపట్టవచ్చు. ప్రధాని ప్రమాణ స్వీకారం సోమవారం సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది.
అప్పులపై జగన్ బహిరంగచర్చకు సిద్దమా?
వైసీపీ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. అప్పులపై అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు, రోజుకో నిబంధన.. ఉల్లంఘన అనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని యనమల ఆరోపించారు. అప్పులపై సీఎం జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు యనమల తెలిపారు. రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా వాస్తవాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడం లేదని కాగ్ చెప్పిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కన్నా తక్కువ అప్పులు చేస్తున్నామంటూ సీఎం జగన్ మరోసారి అబద్ధ ప్రచారానికి తెర లేపారని యనమల విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.6 లక్షల 38 వేల కోట్లు అప్పు చేసిందని.. అప్పులు 3.98 లక్షల కోట్లు, హఫ్ బడ్డెట్ బారోయింగ్ 93 వేల కోట్లు, కార్పొరేషన్ గ్యారెంటీలు 1.47 లక్షల కోట్లుగా ఉందన్నారు. వీటికి అదనంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లల్లో ఉంటాయన్నారు.
మతం మార్చుకుని పెళ్లి.. కరెంట్ షాకిచ్చి చంపేసిన భర్త
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న మహిళను భర్తే దారుణంగా హత్య చేశాడు. లఖీంపూర్ లోని గోలా గోకరన్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి తన భార్యను విద్యుత్ షాక్ కు గురిచేసి చంపేశాడు. చిన్న గొడవ చిలికిచిలికి భార్య మరణానికి దారి తీసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే..ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించినా నిందితుడి కన్నతల్లే పోలీసులకు హత్య గురించి తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిందితుడు మహ్మద్ వాషి కొన్నేళ్ల క్రితం ఉషాశర్మ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఉషాశర్మ ఇస్లాం మతాన్ని స్వీకరించి అక్సా ఫాతిమాగా మారిన తర్వాత కొన్నేళ్లుకు ఆమెను వివాహం చేసుకున్నాడు. నిద్రపోయే ముందు మహ్మద్ వాషి తన భార్యతో గొడవపడ్డాడు. ఆమె నిద్రపోయిన తర్వాత ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఆ తరువాత విద్యుత్ షాక్ ఇచ్చి చంపేశాడు. నిందితుడు ఆమెను అదే గదిలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. తనను పట్టుకోబడకుండా ఉండటానికి రెండు రోజుల పాటు ఒకే గదిలో పడుకున్నాడు.
ఏపీలో రోడ్డుమీదకు రానున్న విమానాలు
ఏపీలో చాలా ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. గన్నవరం, రేణిగుంట, విశాఖ లాంటి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులతో పాటు పలు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. అయితే ఈనెల 29న ఏపీలో జాతీయరహదారిపై విమానాలు ల్యాండ్ కానున్నాయి. విజయవాడ-ఒంగోలు మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై విమానాలు ల్యాండ్ అవుతాయి. అయితే ఇది మాక్ డ్రిల్ మాత్రమే. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా ఉండేలా నేషనల్ హైవేలో కొంత మేర మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రేణింగవరం, కొరిశపాడు గ్రామాల మధ్య నుంచి వెళ్తున్న 16వ నెంబరు జాతీయ రహదారిపై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు 4 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్డు వెడల్పుగా నిర్మించారు.
సాంగ్‌లో కూడా స్టంట్స్‌ను వదల్లని అజిత్
తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ అవనున్న ఈ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. హెచ్. వినోద్ ‘తునివు’ని బాడ్ మాన్స్ గేమ్ గా రూపొందించాను అంటూ సినిమాపై అంచనాలు పెంచాడు. ఈ అంచనాలు మరింత పెంచుతూ మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రాన్ ‘గ్యాంగ్ స్టా’ అనే సాంగ్ ని బయటకి తెచ్చాడు. తునివు ఆల్బం నుంచి ఇప్పటికే రెండు పాటలు బయటకి వచ్చాయి. ‘చిల్లా చిల్లా’ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది… ఇదే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చెయ్యడానికి ‘గ్యాంగ్ స్టా’ సాంగ్ రిలీజ్ అయ్యింది. సినిమాలో కాదు పాటలో కూడా యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఇది నిజంగానే బాడ్ మాన్స్ గేమ్ అనే మాటని ప్రూవ్ చేసింది ‘గ్యాంగ్ స్టా’ లిరికల్ సాంగ్. ఘిబ్రాన్ ఇచ్చిన ట్యూన్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉండగా, సుల్తాన్ మరియు వికేక రాసిన లిరిక్స్ అజిత్ నేచర్ ని తెలియజేసేలా ఉన్నాయి. ఈ సాంగ్ ని ఘిబ్రాన్ స్వయంగా పాడడం విశేషం.సోషల్ మీడియాలో #ItsTimeForGANGSTAA అనే హాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి అజిత్ ఫాన్స్ హంగామా చేస్తున్నారు.