రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసు.. మళ్లీ మారిన సిట్..!
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 2024 డిసెంబర్ 6న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.. గతేడాది జూన్ జూలై నెలల్లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఐదు పోలీస్ స్టేషన్ లలో 13 రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి .. ఈ కేసుల్లో 84.87 కోట్లు విలువైన 22 వేల 947 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. సిట్ చీఫ్ గా వినీత్ బ్రీజిలాల్ ను నియమించారు.. ఏమైందో ఏమో సడన్ గా ఆయన కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్ళిపోయారు.. దాంతో మే 7న కొత్త బాస్ గా ఐపీఎస్ అధికారి రవికృష్ణ ను ప్రభుత్వం నియమించింది.. సిట్ బృందంలో కూడా మార్పులు చేర్పులు చేశారు.. సిఐడి ఎస్పి ఉమామహేశ్వర్, కాకినాడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, కర్నూలు ఐసిడిఎస్ ఆర్జెడి రోహిణి, విజయనగరం డిఎస్ఓ మధుసూదన్ రావు, కోనసీమ సివిల్ సప్లై మేనేజర్ బాల సరస్వతిని విచారణ చేయాలని ఆదేశించింది.. కానీ, మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది.. సిట్ బృందం ఒక సమావేశం కూడా అవలేదు.. కనీసం గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు సిట్ చీఫ్, అందులో సభ్యులను నాలుగు సార్లు మార్చారు… కొందరు అధికారులు గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారని వారిని పక్కన పెట్టారు.. కానీ, అసలు ఉద్దేశం మాత్రం ముందుకు సాగలేదు.. అసలు కేసు ఎక్కడ వరకు వచ్చిందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది.
పదవులు, పైసలూ మీకేనా.. సీఎంను ప్రశ్నించిన మునుగోడు ఎమ్మెల్యే!
‘పదవులు మీకే.. పైసలూ మీకేనా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు, సీసీ రోడ్డు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు.. తన నియోజకవర్గ అభివృద్ధికి అయినా డబ్బులు ఇవ్వండి అని సీఎంను రాజగోపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో నిర్వహించిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరణ అనంతరం సొంత పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు రావడం లేదని కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ఇస్తే వస్తుంది. అందుకే సీఎంనే నేరుగా అడుగుతున్నా. సీఎం, కాంగ్రెస్ పార్టీని నేను విమర్శించడం లేదు. నా నియోజకవర్గంకు రావాల్సిన నిధులు అడుగుతున్నా. 20 నెలల నుంచి నా నియోజకవర్గంలో రోడ్లకు, బిల్డింగులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. నేనే స్వయంగా మంత్రి దగ్గరకు వెళ్లి అడిగినా బిల్లులు రాలేదు. వందసార్లు తిరిగినా రాలేదు. అందుకే పదవులలో మీరే ఉంటారు.. నిధులు మీరే తీసుకుంటున్నారు అని అడగాలా వద్దా?. కనీసం నాకు పదవి ఇవ్వనందుకు.. నా నియోజకవర్గ అభివృద్ధికి డబ్బులు అయినా ఇవ్వండి. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నా మునుగోడు నియోజకవర్గంకు నిధులు ఇవ్వండి’ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.
నిజమైన మహిళ అనుకుని.. ఏఐ చాట్ బాట్ తో 76 ఏళ్ల వృద్ధుడు ప్రేమాయణం.. కలవడానికి వెళ్తూ ఘోరం
ఎల్లలు దాటిన లవ్ స్టోరీలు ఉన్నాయి.. కానీ, ఇది అంతకు మించింది. ఏకంగా ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ఏఐ చాట్ బాట్ తో లవ్ లో పడ్డాడు అమెరికాకు చెందిన ఓ 76 ఏళ్ల థాంగ్‌బ్యూ “బ్యూ” వాంగ్‌బాండ్యూ, రిటైర్డ్ చెఫ్. ‘బిగ్ సిస్ బిల్లీ’ అనే ఫేస్‌బుక్ AI చాట్‌బాట్‌తో ప్రేమలో పడ్డాడు. నిజమైన మహిళగా భావించి అంతులేని ప్రేమను పెంచుకున్నాడు. చాలా కాలంగా ఒక కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఆధారిత చాట్‌బాట్‌తో తరచూ సంభాషిస్తూ వచ్చాడు. ప్రతిరోజూ గంటల తరబడి ఆ వర్చువల్ సహచరితో మాట్లాడటం వలన, అతనికి దానిపై బలమైన భావోద్వేగ అనుబంధం ఏర్పడింది. ఓ రోజు చాట్‌బాట్ అతన్ని కలవమని ఆహ్వానించింది. అతనికి చిరునామా కూడా ఇచ్చింది. ఇంకేముంది తనకు ప్రాణం లాంటి AI చాట్‌బాట్‌ను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో ఆ వ్యక్తి దురదృష్టవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక!
బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదివారం అభ్యర్థిని ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకోవడానికి బీజేపీ దగ్గర బలం ఉంది. మిత్రపక్షాలను కలుపుకుని విజయం సాధించనుంది. అలాగే తటస్థంగా ఉండే బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతును కూడా బీజేపీ కోరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే ఈ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సీనియర్ కేంద్ర మంత్రులు, అనుభవజ్ఞులైన పార్లమెంటేరియన్లు నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లోనే ఎంపీల విధులు, బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎంపీలంతా సెప్టెంబర్ 6 సాయంత్రం నాటికి ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇక సెప్టెంబర్ 8న ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఉన్న కారణాన ఈ మాక్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
2022లో ట్రంప్ అధ్యక్షుడైతే.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరిగేది కాదు..
శనివారం అలాస్కాలో ట్రంప్‌తో సమావేశమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. 2022లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగేది కాదని అన్నారు.ట్రంప్ ఇంతకుముందు కూడా ఇదే చెబుతున్నారని, తాను కూడా అలాగే నమ్ముతున్నానని ఆయన అన్నారు. 2022లో ఈ విషయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు బైడెన్‌ను ఒప్పించడానికి తాను ప్రయత్నించానని పుతిన్ తెలిపారు. ఇప్పుడు ట్రంప్‌తో కలిసి ఈ మార్గంలో ముందుకు సాగడం ద్వారా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపగలం. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. రష్యా భద్రత అత్యంత ముఖ్యమైనదని, తదుపరి సమావేశం మాస్కోలో జరగాలని పుతిన్ కోరారు.
ఆ ఐదుగురు స్టార్స్‌కు నో ప్లేస్.. గిల్ కూడా డౌటే!
యూఏఈ వేదికగా 2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆగస్టు 19 లేదా 20న భారత జట్టును ప్రకటించే అవకాశముంది. ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత్ బరిలో దిగడం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ అటుంచితే.. శుభ్‌మన్ గిల్‌కు చోటు కూడా దక్కకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 జట్టులో ప్రయోగాలు చేయడానికి బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించినా.. ఆసియా కప్ 2025లో మాత్రం ఆడే అవకాశం దక్కకపోవచ్చని సమాచారం. ఇటీవలి రోజుల్లో అన్ని ఫార్మాట్లకు గిల్‌నే కెప్టెన్‌గా చేస్తారనే వార్తలొచ్చాయి కానీ.. ప్రస్తుతానికి సారథ్య మార్పు ఉండకపోవచ్చని సమాచారం. స్టార్స్ యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు స్థానం అనుమానమే. జైస్వాల్‌ను టెస్టు క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరించమని బీసీసీఐ సెలక్టర్లు కోరారట.
రజినీకాంత్ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు – అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ
భారతీయ సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సూపర్‌స్టార్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రజినీకాంత్. సాధారణ కుటుంబంలో పుట్టి, బస్ కండక్టర్‌గా పని చేస్తూ ప్రారంభమైన ఆయన జీవన ప్రయాణం, సినీ రంగంలో సగర్వంగా నిలిచారు. తన ప్రత్యేకమైన నటన, అద్భుతమైన స్టైల్, మాస్స్ అప్పీల్, క్లాస్ టచ్ కలిపి రజనీకాంత్ ఒక లివింగ్ లెజెండ్‌గా నిలిచారు. ఒకవైపు యాక్షన్ హీరోగా, మరోవైపు హాస్యంతో, సీరియస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయనకు సరిహద్దులు లేవు. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుని అభిమాన హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. ఇక తాజాగా ఆయన సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకోన్నారు. ఇది కేవలం ఒక స్టార్‌కి మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినీ ప్రపంచానికి ఒక గర్వకారణం అని చెప్పాలి.