న్యాయమూర్తి ఎదుట కంట తడి పెట్టారు రాజ్ కేసిరెడ్డి.. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్ల రూపాయలు తనవే అని సిట్ లింకులు పెడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని కోరాడు కేసిరెడ్డి.. తాను 2024 జూన్ లో ఆ డబ్బు వరుణ్ కి ఇచ్చినట్టు చెబుతున్నారని.. ఆ నోట్లు RBI ఎప్పుడు ముద్రించింది అనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు..
ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. అనేక అంశాలపై స్పదించారు.. అన్నదాత సుఖీభవ, పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించిన ఆయన.. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు.. చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తున్నాం.. గత ప్రభుత్వానికంటే రెండింతలు సంక్షేమం ఇస్తున్నాం.. లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.. ఆర్థిక చేయూతను పెంచాం. ఈ నెలలోనే సూపర్ సిక్స్ లోని రెండు హామీలు నెరవేరుస్తున్నాం. రేపు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నాం.…
వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై హాట్ కామెంట్లు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. సీఎం చంద్రబాబు బావిలో దూకాలన్న జగన్ కామెంట్లుకు కౌంటర్ ఇచ్చిన ఆమె.. చంద్రబాబు బాయిలో దూకడం కాదు జగన్.. నువ్వు నీరు లేని బావిలో పడ్డా.. నీ పాపాలు పోవు అని వ్యాఖ్యానించారు.. సూట్ కేసు రెడీ చేసుకుని ఉండు... త్వరలో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత..
ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. 6,100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల కాగా.. ఫలితాలను ఆన్లైన్లో అందుబాటులో పెట్టినట్టు తెలిపింది ఏపీ ప్రభుత్వం..
అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ఇపుడు ఆక్వారంగంపై పిడుగు పడినట్టు చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. నిన్నమొన్నటి వరకు రొయ్యలపై 3 నుంచి 4 శాతంగా ఉన్న సుంకాన్ని .. అమెరికా 25 శాతానికి పెంచడంతో ఎగుమతి చేయాలంటే ఇకపై భారీగా పన్నులు చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. సిట్ అధికారులు ఓ వైపు దర్యాప్తులో దూకుడు చూపిస్తున్నారు.. మరోవైపు, ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్నారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు బయల్దేరాడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..