Stree Shakti Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు శుభవార్త చెబుతూ.. స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఈ సందర్భంగా బస్సులో సరదా సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. బస్సు ఎక్కగానే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆపిన మంత్రి నారా లోకేష్ .. నా నియోజకవర్గానికి వచ్చారు.. నలుగురికి నేనే టికెట్ తీస్తాను అన్నా.. అంటూ పవన్‌ను ఆపారు లోకేష్.. తాను డబ్బులు ఇచ్చి సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని కండక్టర్ కు చెప్పారు నారా లోకేష్. అంతేకాదు.. మంగళగిరిలో బస్సు టికెట్ డబ్బులు నేనిచ్చాను.. మీ నుండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకుంటా అంటూ సరదాగా మాట్లాడారు నారా లోకేష్.
Read Also: Collie : 24 గంటల్లోనే ఊహించని టికెట్ బుకింగ్స్ – రికార్డులు తిరగరాసిన ‘కూలీ’
ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారిపోయింది. మరోవైపు, బస్సు ప్రయాణంలో.. వెనకాల నుంచి మాటల సౌండ్ రావడంతో. సీఎం చంద్రబాబు.. ఎవరూ అని అడగడం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వెనకాల ఉన్న లోకేష్ అని చెప్పారంటూ.. వారి ప్రయాణం మొత్తం సరదాగా సాగిందని.. కూటమి నేతల మధ్య.. ఎలాంటి భేషజాలు లేకుండా.. అంతూ సరదాగా బస్సులో ప్రయాణం చేశారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. ఇక, అమరావతిలోని ఉండవల్లి సెంటర్ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఎం చంద్రబాబు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ ప్రయాణం సందర్భంగా సీఎం చంద్రబాబు, మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే, రోడ్లకు ఇరువైపులా నిలబడి ఉన్న ప్రజలకు, మహిళలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్.. ఇతర ప్రజాప్రతినిధుల ప్రయాణం కొనసాగింది..