Dharmavaram: ధర్మవరంలో ఉగ్ర లింక్‌ల కలకలం.. ఎన్ఐఏ అదుపులో వంట మనిషి..!
- ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికల కలకలం..
- ఎన్ఐఏ అదుపులో ఓ బిర్యానీ పాయింట్ లో పనిచేసే వంట మనిషి..
- అనుమానితుడి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి.. స్థానికంగా ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు.. ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలను ఎన్ఐఏ గుర్తించింది. ఓ బిర్యానీ పాయింట్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ను అదుపులోకి తీసుకుని విచారింస్తోంది ఎన్ఐఏ బృందం. ధర్మవరం పట్టణంలోని లోనికోట ఏరియాలో నివాసం ఉంటున్న నూర్.. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దీంతో, ఎన్ఐఏ రంగంలోకి దిగింది… నూర్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు.. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుంది. నూర్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.
Read Also: Ghattamaneni : తేజ డైరెక్షన్‌లో.. హీరోయిన్‌గా రమేష్ బాబు కూతురు ఎంట్రీ!
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
అయితే, ఆంధ్రప్రదేశ్‌తో ఉగ్ర లింక్‌లు వరుసగా బయటపడుతూ కలకలం రేపుతున్నాయి.. మొదట విజయనగరం.. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల లింక్‌లు ఆందోళనకు గురిచేశాయి.. రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.. 30 ఏళ్లుగా పట్టణంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని అరెస్ట్ చేసిన ఐబీ అధికారులు.. వారి వద్ద స్వాధీనం చేసుకున్న సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేసిన విషయం విదితమే..
- Tags
- Andhra Pradesh
- Chef
- cook
- dharmavaram
- IB
తాజావార్తలు
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!