Gannavaram Incident: గన్నవరం ఘటన కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది.. ఈ ఘటనపై రాజకీయం దుమారం రేగుతోంది.. వైసీపీ నేతపై టీడీపీ.. తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.. అయితే, అసలు గన్నవరంలో రెచ్చగొట్టింది ఎవరు? అని ప్రశ్నించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వాళ్లే అరాచకాలు సృష్టించి మా పార్టీని బాధ్యులను చేయాలనే కుట్ర జరుగుతోంది.. గన్నవరం కేంద్రంగా రెండు, మూడు రోజులుగా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి.. టీడీపీ ఆలోచనలోనే…
Sajjala Ramakrishna Reddy: అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు.. నిజమైన సంస్కరణలను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే నంటూ ప్రశంసలు కురిపించారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆత్మీయ సమావేశంలోఎంపీ ఆర్ కృష్ణయ్య, పలువురు ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల రామకృష్ణా రెడ్డి.. బీసీలంటే వెనుకబడిన క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌గా సీఎం…
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో న్యూడ్ ఫోటోల కలకలం రేపాయి. సమస్యలు తొలిగిపోయి, ఇంట్లో నోట్ల వర్షం కురుస్తుందని కేటుగాళ్ళు మహిళలను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన అమాయక ఆడవారు నిజంగానే సమస్యలు తొలిగిపోతాయని నమ్మారు.
Off The Record: ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది అధికార పార్టీ. అమలాపురం నియోజకవర్గానికి చెందిన ఇజ్రాయెల్‌కి ఎమ్మెల్యే కోటాలో.. శెట్టిబలిజ సంఘం నేత కుడుపూడి సూర్యనారాయణకు స్థానిక సంస్థల కోటాలో ఛాన్స్ ఇచ్చారు. అమలాపురం అల్లర్లు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మాదిగ, శెట్టిబలిజ సామాజికవర్గాలను దగ్గర చేసుకోవడానికి ఆ విధంగా వ్యవహరించింది. అయితే గవర్నర్ కోటాలో జిల్లాలో కాపులకు అవకాశం ఇద్దామనే ఆలోచన సాగిందట. దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ జరిగినా..…
Off The Record: బాపట్ల జిల్లా చీరాల. నిన్న మొన్నటి వరకూ మూడు ముక్కలాటగా కొనసాగిన ఇక్కడ వైసీపీ వ్యవహారాలకు పార్టీ అధిష్ఠానం చెక్ పెట్టింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత చీరాల వైసీపీలో మూడు పవర్ సెంటర్స్‌గా మారటంతో పార్టీ పరిస్థితి మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్టుగా తయారైంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసి ఓడారు. ఆమంచిపై గెలిచిన…
YSR Law Nestham: రాష్ట్రంలోని లాయర్లకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకుంటున్నవారికి వైఎస్సార్ లా నేస్తం కింద ఆర్థిక సాయం అందజేస్తుండగా.. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ మొత్తాన్ని అందించనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది న్యాయవాదులకు లబ్ది చేకూరనుంది.. అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో బుధవారం రోజు అంటే ఈ నెల 22వ తేదీన రూ. 1,00,55,000 ను వర్చువల్…
Pregnant Women: ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక… డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. ఈ ప్రయాణం వారి ప్రాణాల మీదకు కూడా తెలుస్తోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో డోలీలో ఆస్పత్రికి వెళ్లిన ఓ తల్లి… కడపులోనే బిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరవుతోంది. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పనసబంద గ్రామానికి చెందిన గర్భిణి బానుకు ఈ ఉదయం పురిటి నెప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో… గ్రామస్తులు, కుటుంబ సభ్యులు…
Off The Record:కన్నా లక్ష్మీనారాయణ. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. రాష్ట్ర విభజన తర్వాత అనూహ్యంగా బీజేపీలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. పైగా తన రాజకీయ జీవిత ప్రయాణంలో టీడీపీని బద్ధ శత్రువుగానే చూశారు. ఓ రేంజ్లో టీడీపీని.. టీడీపీ పెద్దలను విమర్శించిన ఉదంతాలు ఎన్నో.. ఎన్నెన్నో. అలాంటిది బీజేపీని వీడిన కన్నా.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుండటం మరింత ఆశ్చర్య పరుస్తోంది. విద్యార్ధి దశ నుంచి కన్నా కాంగ్రెస్ వాది. దాదాపు మూడు దశాబ్దాలుగాపైగా టీడీపీని వ్యతిరేకిస్తూ…
మందు బాబులకు వినూత్న శిక్ష.. వైజాగ్ బీచ్ మొత్తం క్లీన్..! విశాఖ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మందు బాబులకు విధించిన శిక్ష ఆస్తికరంగా మారింది.. గత మూడు రోజుల్లో డంకెన్ డ్రైవ్ లో 52 మంది మందుబాబులు విశాఖ పోలీసులకు చిక్కారు. అయితే, అందరినీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇక్కడే వినూత్నంగా ఆలోచించారు విశాఖ కోర్టు జడ్జి.. మందుబాబులకు జరిమానా మాత్రమే విదిస్తే సరిపోదని భావించిన కోర్టు.. వారిలో పరివర్తన తెచ్చేందుకు పూనుకున్నారు..…
Loan App Harassment: కృష్ణా జిల్లా అవనిగడ్డలో లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. చల్లపల్లికి చెందిన మహమ్మద్ లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ పాల ఫాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహమ్మద్.. హీరో ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్ తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లిస్తున్నా.. ఇంకా కట్టాలంటూ అసభ్యకర మెసేజ్‌లు, కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్లు చేసి వేధించారు. ఆ వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మహమ్మద్. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు…