TV Rama Rao Resigns YSRCP: వైసీపీకి షాక్..! పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TV Rama Rao Resigns YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఇవాళ ప్రకటించారు. త్వరలోనే టీవీ రామారావు.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. కొవ్వూరులో తన అభిమానులు, అనుచరులతో సమావేశమైన రామారావు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో.. తమను నమ్ముకున్న అనుచరులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాను.. తీవ్ర మనస్థాపంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నా.. అనుచరుల సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది..
Read Also: YS Viveka Murder Case: ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ.. వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
కాగా, 2009లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీచేసిన టీవీ రామారావు.. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ నిరాకరించింది.. కానీ, పార్టీ అభ్యర్థి కేఎస్ జవహర్‌కు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనైనా టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించినా నిరాశతప్పలేదు.. దీంతో.. టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన 2019లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కొవ్వూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తానేటి వనితకు మద్దతుగా ప్రచారం చేసి ఆమె విజయం కోసం కృషి చేశారు. ఇక, ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడంతో.. ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!