Chevireddy Bhaskar Reddy: నా సంపాదనలో 75 శాతం ప్రజల కోసమే ఖర్చు చేస్తాను.. అలాంటి నాపై విమర్శలు చేస్తారా? అంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. చంద్రగిరి సమీపంలోని తొండవాడ వద్ద బహిరంగ సభ నిర్వహించారు చేవిరెడ్డి.. ఈ సభకు ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డెప్పా, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.. నారా లోకేష్ విమర్శలకు కౌంటర్ గా భారీ సభ నిర్వహించారు చెవిరెడ్డి.. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ది చంద్రగిరిలో జరిగిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు తొలి నుంచి అండగా ఉన్నాను.. 430 కోట్ల రూపాయలతో చంద్రగిరిని అభివృద్ది చేశాను.. నా సంపాదనలో 75 శాతం ప్రజలకు ఖర్చు పెడతాను.. నేను ఎక్కడా పబ్లిసిటీ చేసుకోలేదన్నారు చెవిరెడ్డి.
Read Also: skill-development scam: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం
ప్రతి పంచాయితీకి రెండున్నర కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా నిధులు ఇచ్చాను.. నాపై చేసిన విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తాను అన్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. మరోవైపు.. వైఎస్ జగన్ అధికారంలో జరిగిన మేలు అంతా గుర్తించాలని సూచించారు ఎంపీ మిథున్‌రెడ్డి.. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మవడి పథకాలు రద్దు చేస్తానని నారా లోకేష్ చెప్పడం దారుణమైన విషయమన్న ఆయన.. కరోనా సమయంలో చెవిరెడ్డి చేసిన సేవలు అమోఘం అన్నారు. ప్రభుత్వ పథకాలు ఇప్పటికీ టీడీపీ నాయకులకు అందుతోంది అని వెల్లడించారు. చెవిరెడ్డి చేస్తున్న సాయం మాకూ చేయాలని మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని అడుగుతుంటారు అని వెల్లడించారు ఎంపీ మిథున్‌రెడ్డి.