H3N2 Influenza Virus: దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది.. పలు రాష్ట్రాల్లో ఈ కేసులు ఇప్పటికే వెలుగు చూశాయి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్కడక్కడ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. అయితే, హెచ్3ఎన్2 రాష్ట్రంలో అదుపులోనే ఉంది.. ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు మంత్రి విడదల రజనీ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. జ్వరం తర్వాత కొద్దీ రోజులు పొడి దగ్గు వేధిస్తోంది.. వైరల్ జ్వరాలకు సాధారణ వైద్య సేవలు సరిపోతాయన్నారు.. ఇక, కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి అన్నింటికి సిద్ధంగా ఉన్నామన్న ఆమె.. మందులు, ఆస్పత్రులను సిద్ధం చేశామన్నారు.. కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం.. ఈ వైరల్ జ్వరాలు నియంత్రణలోకి వస్తున్నాయని పేర్కొన్నారు మంత్రి విడదల రజనీ.
Read Also: Influenza A: మార్చి చివరి నాటికి ఇన్‌ఫ్లూయెంజా తగ్గుముఖం.. హెచ్3ఎన్2ను పరిశీలిస్తున్నామన్న కేంద్రం
మరోవైపు అమరావతిలో మీడియాతో మాట్లాడిన డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వినోద్ కుమార్.. రాష్ట్ర వ్యాప్తంగా H3N2 వైరస్ పై అవగాహన కల్పిస్తున్నాం.. ఈ వైరస్ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గతంలో వచ్చి పోయింది.. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖలో ఎక్కువగా కన్పిస్తోందన్నారు.. ముక్కు నుంచి గొంతు వరకు దీని ప్రభావం ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఈ వైరస్ మ్యూటేషన్ అవుతూ వస్తోందన్న ఆయన.. మొదటి మూడు, ఐదు రోజులు దగ్గు, జ్వరం వస్తుంది.. చిన్నారులు, వృద్దులకి ఈ వైరస్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని హెచ్చరించారు.. జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలి.. వైరస్ సోకితే విద్యార్థులను స్కూళ్లకి పంపవద్దు అని విజ్ఞప్తి చేశారు.
ఇక, హెచ్3ఎన్2 వైరస్ పై అనవసర అపోహలు వద్దు అని విజ్ఞప్తి చేశారు డాక్టర్ వినోద్ కుమార్.. బయట నుంచి ఇంటికి రాగానే చేతులు కడుక్కోవాలని సూచించారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన.. ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఈ వైరస్ ద్వారా వచ్చినదిగానే భావించాలన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ ద్వారా ఇన్ఫూయీంజా వ్యాపిస్తోంది.. వైద్యుల సలహాల మేరకే యాంటిబయాటిక్స్ వాడాలని సూచించారు డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వినోద్ కుమార్..