Minister Adimulapu Suresh: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. పవన్ కల్యాణ్ నిలకడ లేని మనిషిగా పేర్కొన్న ఆయన.. పవన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు.. ఒక వైపు బీజేపీతో అంటకాగుతూ మరోవైపు టీడీపీ ముసుగులో పని చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.. అసలు పవన్ కల్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో.. ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాడో.. రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే,…
Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అప్పులు చేయడం సహజం అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ హయాంలో 2 రూపాలకే కిలో బియ్యాన్ని ప్రవేశ పెట్టారు. తద్వారా ప్రభత్వంపై భారం పడింది… అలా అని పేదలకు సంక్షేమ పథకాలను ఆపేయలేం కదా? అని ప్రశ్నించారు.. అలానే మేం కూడా పేద ప్రజలకు ప్రభుత్వ సొమ్ముతో పథకాలను అందిస్తున్నాం.. అలాంటి పరిస్థితిల్లో అప్పులు…
పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని మంత్రి హరీశ్ రావ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా రామయంపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం రామయంపేటలో KCR కాలనీ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను మంత్రి ప్రారంభించారు. టెన్త్ పేపర్ లీకేజీలపై బండి సంజయ్ అరెస్ట్ స్పందించిన మంత్రి హరీశ్ రావు సంజయ్ పై…
రానున్న 2024 ఎన్నిలకల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయం అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశాడు అని చెప్పలేడు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఏమి చేశాడో చెబుతాడు.. తప్ప ఆయన ఏమి చేసింది చెప్పులేని వ్యక్తి చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు.. ఇక,…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించిన విషయం విదితమే.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు మరికొందరు నేతలను కలిశారు.. అయితే, బీజేపీ-జనసేన పొత్తు వ్యవహారంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు.. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.. దేశానికి జగ్జీవన్ రాం ఎన్నో సేవలందించారని గుర్తుచేసిన ఆయన..…
Anil Kumar Yadav: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదనే భయంతో ఉన్నవారే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యేలో అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నెల్లూరు నగర ప్రజలపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ 11 వందల కోట్లు అప్పు పెడితే.. మేం అప్పు లేకుండానే అభివృద్ది చేస్తున్నాం అన్నారు.. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ది చేశారో చెప్పుకునే ధైర్యం…
Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ తాకింది.. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కార్వేటినగరం పెద్ద దళితవాడలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు నారాయణస్వామి.. అయితే, కార్వేటి నగరం పెద్ద దళితవాడ గ్రామంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఓ మహిళ నిలదీసింది.. ఉచిత రేషన్ బియ్యం అన్నారు మాకు ఇంతవరకు వేయలేదన్న ఆ మహిళ.. ఇంటింటికి వచ్చి రేషన్ బియ్యం అందిస్తామన్నారు.. కానీ, మా ఇంటి దగ్గరికి ఏ…
Family Doctor Program : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. దీని కోసం రేపు అనగా ఈ నెల 6వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు.. లింగంగుంట్లలో పర్యటించనున్న సీఎం.. ఫ్యామిలీ డాక్టర్ విధానం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఇక, ఈ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి విడదల రజిని పరిశీలించారు. సీఎం ముందుగా లింగంగుంట్ల గ్రామం చేరుకుని ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ శివ శంకర్…
Bezawada Drugs Sase: బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు.. డ్రగ్స్ సరఫరా చేసిన బెంగుళూరుకు చెందిన శశిని అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు.. నిందితుడిని బెంగుళూరు నుంచి బెజవాడకు తీసుకొచ్చారు.. స్కూల్ బ్యాగ్ లో MDMA డ్రగ్స్ ను పెట్టి శశికుమార్ బెంగుళూరులో ఆర్టీసీ బస్సులో ఇచ్చినట్టుగా గుర్తించారు.. ఇక, ఈ డ్రగ్స్ ను బెజవాడలో రిసీవర్లుగా ఉన్న హర్ష, సుహాస్, వర ప్రసాద్ ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం…
బండి సంజయ్ అర్థరాత్రి అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనకు బీజేపీ పిలుపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బండి సంజయ్ కుమార్ ని అర్ధరాత్రి అరెస్టు చేయడం…