TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఎప్పుడు ఏ నెల టికెట్ల కోటాను విడుదల చేస్తారో? ఆ విషయాన్ని ఎప్పుడో ప్రకటిస్తారో అని ఇకపై ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. ఆన్ లైన్ దర్శన టికెట్లకు సంబంధించిన క్యాలెండర్ ని విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఆ క్యాలెండర్ ప్రకారం.. ఈ నెల.. ఏ కోటాకు సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారో మీకోసం..
* 20వ తేదీన ఉదయం 10 గంటలకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే జూలై మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు విడుదల
* 20వ తేదీ ఉదయం 11:30 గటలకు జులై నెలకు సంబంధించిన కళ్యాణోత్సవం,ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా, డోలోత్సవం టికెట్ల విడుదల.
* 21వ తేదీ ఉదయం 10 గంటలకు జులై మాసానికి సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల.
* 21వ తేదీన మధ్యహ్నం 3 గంటలకు జులై మాసానికి సంబంధించిన వయోవృద్దులు, వికలాంగుల దర్శన టోకెన్లు విడుదల.
* 24వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన వర్చువల్ సేవా టికెట్లు కలిగిన భక్తులుకు దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టికెట్లు విడుదల
* 25వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.
* 26వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన తిరుమలలోని వసతి గదులు కోటా విడుదల.
* 27వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన తిరుపతిలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ.