ఆ ఘనత కేసీఆర్, కేటీఆర్‌లకే దక్కుతుంది
హనుమకొండలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో సంవత్సరంలో హైదరాబాద్‌కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని.. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌లకే దక్కుతుందన్నారు. ఆడపిల్ల పెళ్లికి మేనమామగా లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. మేనమామగా సీఎం కేసీఆర్‌ను ఆదరించాలని ఎర్రబెల్లి పేర్కొ్న్నారు. కర్ణాటకలో పెన్షన్ 500 వస్తుందన్న మంత్రి.. కరోనా కారణంగా ఇప్పుడు అది కూడా రావట్లేదన్నారు. తెలంగాణలోనే ప్రతి కుటుంబానికి 2000 పింఛన్‌ను కేసీఆర్ ఇస్తున్నారన్నారు. నిన్న ఢిల్లీలో కేంద్రమంత్రులు తెలంగాణ పథకాలను పొగిడారన్న మంత్రి.. సిగ్గు లేకుండా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇయ్యనివారు కూడా ధర్నాలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టైతే నేను దేనీకైనా సిధ్ధమంటూ మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణలో ఇంకా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అందరి లెక్కలూ తేలుస్తాం..
పల్నాడు జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతలు మాటల యుద్ధంతో వాతావరణాన్ని మరింతగా వేడెక్కిస్తున్నారు. యరపతినేని శ్రీనివాసరావు హాట్ కామెంట్లు చేశారు. ఏపీ లో టిడిపి గెలవబోతుంది అని కేంద్ర పెద్దలకు కూడా తెలిసిపోయింది. అదే విషయం సీఎం జగన్ కు అమిత్ షా చెప్పి పంపించారన్నారు. బాబాయ్ వైవెస్ వివేకాని చంపిన కేసుల్లో ఏపీ సీఎం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు…మాచర్ల లో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు చరమగీతం పాడేందుకు టిడిపి కార్యకర్తలు కొదమ సింహాలు గా మారాల్సిన అవసరం వచ్చిందన్నారు యరపతినేని. మాచర్ల లో 20 వేల మెజారిటీ తో బ్రహ్మారెడ్డి గెలవబోతున్నాడని యరపతినేని జోస్యం చెప్పారు. సొంత పార్టీ కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర పిన్నెల్లి సోదరులది అని ఆయన మండిపడ్డారు. నేను బ్రహ్మా రెడ్డి సొంత అన్నదమ్ములం కాకపోయినా అంతకు మించి పల్నాడు ప్రాంతంలో సోదర భావంతో పని చేస్తాం అన్నారు. పల్నాడులో టిడిపి నాయకులను వేధించిన ప్రతి పోలీసు చరిత్ర రాస్తున్నాం…రాబోయే కాలంలో అందరి లెక్కలు అప్పజెప్తాం అన్నారు యరపతినేని శ్రీనివాసరావు.
రెచ్చిపోయిన సైబర్ కేటుగాళ్ళు
ఈజీమనీకి అలవాటుపడిన సైబర్ కేటుగాళ్లు ఎవరినీ వదలడం లేదు. అనంతపురం జిల్లాలో సైబర్ మోసగాళ్ళు మాయచేసి యువకుడి ఖాతా నుంచి నగదు మాయం చేశారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు.ఏ చిన్న అవకాశం ఉన్న సరే దోపిడీకి పాల్పడుతున్నారు.చదువుకున్న వాళ్ళు చదువురాని వాళ్ళు అన్న తేడా లేకుండా అడ్డుగోడలుగా దోచేసుకుంటున్నారు.ఇక సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో పెద్దపెద్ద ఉద్యోగస్తులు పాటు నిరుద్యోగులు కూడా ఉన్నారు.ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి పట్టణం జెండా వీధికి చెందిన మొహమ్మద్ సిరాజుద్దీన్ అనే యువకుడు బ్యాంక్ అకౌంట్ లో మంగళవారం నగదు మాయమైంది. నగదు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో పరిశీలించిన యువకుడు బ్యాంక్ అధికారులకు సంప్రదించాడు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు నగదు మాయం చేసినట్లు బ్యాంక్ అధికారులు బాధితుడికి తెలిపారు. బ్యాంకు ఖాతా బుక్ తో ఫిర్యాదు చేసే కంప్లైంట్ రైజ్ చేస్తామని బ్యాంక్ మేనేజర్ బాధితుడికి తెలిపారు. ఆన్లైన్ యాప్ లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు ఖాతాదారులకు అధికారులు సూచించారు. అపరచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వివిధ యాప్ లనుంచి వచ్చే మెసేజ్ లు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. డిజిటల్ మని ట్రాన్స్ ఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవద్దంటున్నారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసు ప్రవర్తన.. కంటతడిపెట్టిన పోలీస్
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు కొంత మంది వ్యక్తులు తనతో అనుచితంగా ప్రవర్తించారని ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియో ఆధారంగా రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని అధికారులు మంగళవారం వెల్లడించారు. రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తులు తనను వేధించారన ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో రోధిస్తూ తెలిపారు. ఆ వ్యక్తులు మంత్రి ఇంటికి రమ్మని అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ తెలిపారు. ఆ వీడియో క్లిప్‌లో ఆ పోలీస్ అధికారి ఎవరి పేరును పేర్కొనలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో బికనీర్ రేంజ్ ఐజీ ఓం ప్రకాష్ ఈ విషయంపై దర్యాప్తు చేయాల్సిందిగా చురు ఎస్పీ రాజేష్ కుమార్ మీనాను ఆదేశించారు. సోమవారం కానిస్టేబుల్ ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు అతనితో అనుచితంగా ప్రవర్తించారని చురు సీఐ రాజేంద్ర బుర్దక్ ఆరోపించారు. మంగళవారం కానిస్టేబుల్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో 24గంటల్లో చెప్పు బండి సంజయ్
ఏ శాఖలో ఎన్నిఖాళీలున్నాయో 24గంటల్లోగా చెప్పు బండి సంజయ్ అంటూ టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారని మండిపడ్డారు. 22 కోట్ల 6 లక్షల అప్లికేషన్ లు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినట్టు మోడీ చెప్పారని తెలిపారు. 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు పార్లమెంట్ లో మోడీ సమాధానం ఇచ్చారని రేవంత్ అన్నారు. దేశ ప్రజలను మోసం చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా మోడీ చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. బండి సంజయ్ మాత్రం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్రం భోజనంకి… నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అన్నట్టు ఉంది బండి మాటలు అంటూ ఎద్దేవ చేశారు. గ్రేటర్ లో బండి పోతే బండి ఇస్తా అని.. తర్వాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు అంట అంటూ వ్యంగాస్త్రం వేశారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పు బండి సంజయ్ అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోనీ ఎన్ని శాఖలు ఉన్నాయో చెప్పు కనీసం.. 24 గంటల సమయం ఇస్తున్నానని తెలిపారు.
యూపీలో ఏ మాఫియా ఎవరినీ బెదిరించదు.
గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్ హత్య అనంతరం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. యూపీలో ఏ మాఫియా ఎవరినీ బెదిరంచదని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌పై అల్లర్ల రాష్ట్ర కళంకాన్ని తొలగించామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2017కి ముందు యూపీ అల్లర్లకు పేరుగాంచింది. రోజుకో గొడవ జరిగేదన్నారు. 2012 నుంచి 2017 మధ్య 700కు పైగా అల్లర్లు జరగ్గా.. 2017 తర్వాత అల్లర్లు జరిగే అవకాశం లేదని తెలిపారు. యూపీలో ఏ జిల్లా పేరు చెబితే భయపడాల్సిన పనిలేదని చెప్పారు. నేడు ఏ నేరస్తుడు వ్యాపారవేత్తను బెదిరించలేడని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీ పెట్టుబడిదారులందరి మూలధనాన్ని సురక్షితంగా ఉంచగలదని సీఎం యోగి స్పష్టం చేశారు. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ (పీఎం మిత్ర) పథకం కింద లక్నో-హర్దోయ్‌లో వెయ్యి ఎకరాల టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి మంగళవారం లోక్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఎంఓయూ కార్యక్రమంలో సీఎం యోగి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి విక్రమ్ జర్దోష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి ప్రసంగిస్తూ.. అంధకారం ఎక్కడ నుంచి మొదలవుతుందో అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ మొదలవుతుందని ఇంతకు ముందు చెప్పుకునేవారని అన్నారు.
గేమ్ ఛేంజర్ కథ క్లైమాక్స్ కి
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి స్టూడెంట్ రోల్. ఈ స్టూడెంట్ రోల్ కి ఇంకో షేడ్ ఉన్నట్లు సమాచారం. సినిమాకి ప్రాణంగా నిలిచే ‘ఎన్నికల అధికారి’గా రామ్ చరణ్ కనిపించేది.. ఈ స్టూడెంట్ లీడర్ తర్వాత వచ్చే చేంజ్ ఓవర్ లోనే. వచ్చే ఏడాది సంక్రాంతిని లేదా సమ్మర్ ని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి.. డైరెక్టర్ శంకర్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. లోకనాయకుడు కమల్ హాసన్ తో చేస్తున్న ‘ఇండియన్ 2’ లేటెస్ట్ షెడ్యూల్ ని శంకర్ కంప్లీట్ చేసాడు.
లోపల బ్రా లేకుండా ఏంటీ షామా.. అవకాశాల కోసం ఇంతలా
బాలీవుడ్ బ్యూటీ షామా సికిందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యేవారికి అమ్మడి అందాల ఆరబోత గురించి తెలిసే ఉంటుంది. 1999 లో మాన్ సినిమా ద్వారా పరిచయమైన ఈ భామ.. వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా అందాల ఆరబోతతో కుర్రకారును మెప్పించింది. ముఖ్యంగా బికినీలతో అమ్మడి మరింత ఫేమస్ అయ్యింది. షామా వయస్సు 41. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లకు గుబులు రేపుతోంది అంటే అతిశయక్తి కాదు. ఈ మధ్యకాలంలో అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటూ రెచ్చిపోతుంది. తాజాగా మరోసారి తన అందాల ప్రదర్శనతో మతులు చెడగొట్టేసింది. ఫ్లోరల్ టాప్ లో లోపల బ్రా లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చి దిమ్మతిరిగేలా చేసింది. క్లివేజ్ షో చేయడంలో అమ్మడి తరువాతే అని మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు.. నోళ్లు వెళ్ళబెడుతున్నారు. ఇక ఇదంతా ఎందుకు అమ్మడు అంటే .. ఇంకెందుకు అవకాశాల కోసమే అంటున్నారు అభిమానులు. షామా ఎంత అందాల ఆరబోత చేసినా.. అమ్మడికి తగినంత స్థాయి లో సక్సెస్ లు దక్కలేదు..