కేవీపీ కీలక వ్యాఖ్యలు.. ఆంధ్రుడిగా సిగ్గు పడుతున్నా..! కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలో కేవీపీ కీలక వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడితే.. దేశంలోని ఒక్క ఎంపీ కూడా ఖండించలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్ రావు. రాహుల్ సభ్యత్వ రద్దుపై ఏపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడక పోవటంతో ఆంధ్రుడిగా తాను సిగ్గుతో తల దించుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పరిస్థితి…
Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో,.. కాదు కాదు.. అసలు ఏపీ రాజకీయాల్లోనే రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వైరం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి నేతలు ఆ మధ్య ఓ పరువు నష్టం కేసులో రాజీ చేసుకుని.. కోర్టులో చేతులు కలుపుకుని దోస్త్ మేరా దోస్త్ అనేసుకున్నారు. అనుకున్నట్లే మూడు నెలలు కామ్‌గానే ఉన్నారు. కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలోకి చేరిపోయారు. అదే పార్టీలో సీనియర్‌గా…
రాహుల్ సభ్యత్వ రద్దుపై ఏపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడక పోవటంతో ఆంధ్రుడిగా తాను సిగ్గుతో తల దించుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదు అంటూ కేవీపీ నిలదీశారు..
Vishnu Vardhan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమానికి సిద్ధం అవుతోంది భారతీయ జనతా పార్టీ.. గుంటూరులో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం వివరాలను వెల్లడించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.. రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని చార్జిషీట్ల రూపంలో ప్రజలకు వివరిస్తాం అన్నారు. మే 5వ తేదీ నుంచి ప్రజా చార్జ్ షీట్ల కార్యక్రమం నిర్వహిస్తాం అని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వ స్టిక్కర్లు…
Mayor Sravanthi: నెల్లూరు నగరపాలక సంస్థ సమావేశంలో అజెండాలోని అంశాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ కారణాలతోనే తనపై దాడి చేశారని నెల్లూరు నగర మేయర్ స్రవంతి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో పెట్టడాన్ని తాను వ్యతిరేకించలేదని.. కేవలం ఫొటో గురించి మాట్లాడుతుండగానే ఒక్కసారిగా తన పోడియం వైపు దూసుకు వచ్చారన్నారు. అంతే కాకుండా సమావేశాన్ని వాయిదా వేసి వెళ్తుండగా తనపై ముగ్గురు కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించారన్నారు. దీనిని తాను సహించబోనని హెచ్చరించారు మేయర్ స్రవంతి.. Read…
Hima Varsha Reddy: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ లో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దినకర్మ నిర్వహించారు.. అయితే, నీరజారెడ్డి దినకర్మ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆమె కూతురు హిమ వర్షా రెడ్డి… అవకాశం కల్పిస్తే పత్తికొండ లేదా ఆలూరు నియోజకవర్గంలోగాని పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.. అమెరికాలో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హిమవర్ష రెడ్డి.. ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు.. గతంలో హిమవర్ష తండ్రి దివంగత పాటిల్ శేషిరెడ్డి కూడా రాజకీయాల్లో…
Adimulapu Suresh: ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. అంతేకాదు.. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పడం చర్చగా మారింది.. అయితే.. తాను చొక్కా విప్పడాన్ని సమర్థించుకున్నారు మంత్రి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నిరసన వ్యక్తం చేస్తే మీ ఇంటిని తగులబెడతారు అనటంతోనే నేను చొక్కా విప్పాను.. దానికి నేను సిగ్గు పడటం లేదన్నారు.. ఎర్రగొండపాలెం ఘటనలో…
High Court: హైకోర్టు ముందు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్డీఏ కమిషనర్‌కి ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జూన్ 20వ తేదీన హాజరు కావాలని పేర్కొంది న్యాయస్థానం.. హైకోర్టుకు వెళ్లే దారిలో కనీస వసతులు కల్పించలేదని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ రోజు కోర్టుకు రావాలని కమిషనర్ కి గతంలోనే ఆదేశాలు ఇచ్చింది.. అయితే, కర్ణాటక ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా హాజరు కాలేక పోతున్నట్టు హైకోర్టుకు తెలిపారు సీఆర్డీఏ కమిషనర్..…
జేసీ సంచలనం.. సీమను తెలంగాణలో కలపాల్సిందే..! తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. రాయలసీమను తెలంగాణలో కలపాలంటూ పేర్కొన్నారు జేసీ.. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి ఉందన్నారు. అసలు రాయల తెలంగాణ (రాయలసీమ, తెలంగాణ) కావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.. ఈ విషయంపైనే నాయకులు అందరితో మాట్లాడుతున్నా.. నేతలను సమీకరిస్తున్నానని తెలిపారు. ఇక, ఎన్నికల తర్వాత…
మే నెలలో రైతు భరోసా ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని.. వైయస్సార్ రైతుభరోసా కింద రైతులకు డబ్బు జమ చేసేందుకు సిద్ధం కావాలని.. అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని.. మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు సీఎం జగన్