చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మా పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయన్నారు.. పిచ్చికి పరాకాష్ట టీడీపీ ఛార్జ్‌షీట్ అని ఫైర్ అయ్యారు.. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు.. సీఎం సంతకాలకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇక, ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన…
Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ భారీగా పెరగబోతోంది.. రేపట్నుంచి ఏపీలో పెరగనున్న భూముల ధరలు అమల్లోకి రాబోతున్నాయి.. భూముల మార్కెట్ ధరలను సవరించే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం చేరవేసింది ప్రభుత్వం.. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. కొన్ని చోట్లే భూముల…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా సర్వర్లు మొరాయించాయి.. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం తరలిరావడంతో.. సర్వర్లు బిజీగా మారి మొరాయించినట్టు చెబుతున్నారు.. ఈ ఎఫెక్ట్‌తో రెండు రోజులుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి.. దీంతో, రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర రద్దీ పెరుగుతోంది.. ఇదే, సమయంలో, సర్వర్లు మొరాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆఫీసుల దగ్గర ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి…