TDP Stage Collapsed: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న సభలో అపశృతి నెలకొంది.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులరగూడెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు.. స్టేజ్ పై ప్రముఖులు టీడీపీ ఇంఛార్జ్ ముద్రబోయిన, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ మరి కొంతమంది ప్రజా ప్రతినిధులు కూర్చొని ఉండగా.. సభలో సీనియర్ నేత చింతకాయల చినరాజప్ప ప్రసంగిస్తున్నారు. సభా వేదిక కుప్పకూలడంతో చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్, ఇతర టీడీపీ నేతలు సహా.. స్టేజ్‌పై ఉన్నవారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. అయితే, స్టేజిపై చినరాజప్ప ప్రసంగిస్తుండగా.. బలమైన ఈదురుగాలులు వీచాయి.. గాలి కారణంగానే సభా వేదిక కూలిపోయింది అంటున్నారు.. ఈ ఊహించని ఘటనతో షాక్ తిన్న టీడీపీ నేతలు.. షాక్ తిన్నారు.. వెంటనే తేరుకొని స్టేజ్ కుప్పకూలడంతో కిందపడిపోయిన నేతలను పైకి లేపే ప్రయత్నం చేశారు. కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్టుగా తెలుస్తుండగా.. ప్రమాదం తప్పడంతో టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.