Andhra Pradesh: రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త సబ్ డిస్ట్రిక్టులను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రీ-సర్వే అనంతరం పాలనా పరమైన వెసులుబాట్లు నిమిత్తం సబ్ డిస్ట్రిక్టులు ఏర్పాటు చేశారు.. పాలనా, పౌర సేవలు అందించంటంలో భాగంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా జరిగేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఈ నిర్ణయానికి వచ్చింది.. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.
Read Also: Royal Tractor: బైక్ ట్రాక్టర్.. భలే ఉంది బాసూ
అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో కొత్త సబ్ డిస్ట్రిక్టులను ఏర్పాటు చేశారు.. ఇక, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో కొత్త సబ్ డిస్ట్రిక్టుల నోటిఫికేషన్ జారీ చేశారు.. విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్టులు ఏర్పాటు చేయగా.. కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్టులలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్టు వెల్లడించారు. కొత్త సబ్ డిస్ట్రిక్టులలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.. ఏపీ సర్కార్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న గ్రామాలు ఇక నుంచి కొత్త సబ్ డిస్ట్రిక్టుల పరిధిలోకి వస్తాయని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.. రిజిస్ట్రేషన్ల సేవల కోసం గ్రామ సచివాలయాల పరిధిని ఫిక్స్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.. తక్షణమే ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.