Hot Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. రేపు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు విరుచుకుపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. రేపు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7, అల్లూరి…
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. దీని కోసం రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్.. ఎన్టీఆర్ జిల్లా అధికారులపై సీరియస్ అయ్యారు.. కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా ఎ.కొండూరులో తాగునీటి సరఫరా గురించి లంబాడి తండా వాసులతో మాట్లాడారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీప్రవీణ్ పవార్… అయితే, తమకు రెండు రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తున్నాయంటూ కేంద్రమంత్రి ఎదుట వాపోయారు తండావాసులు.. ఇక, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారిని వివరణ కోరగా.. తాగునీటికి ఇబ్బంది లేదని అనడంతో కేంద్ర…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్త.. కోడిగుడ్ల ఉత్పిత్తిలో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచినట్లు తాజాగా విడుదలైన కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే 2022 వెల్లడించింది.
తాజాగా ఇవాళ (సోమవారం) కూడా గోల్డ్ రేట్లో పెరుగుదల కనిపించకపోవడంతో పాటు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. రూ. 60,480గా ఉంది.
ఈనెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ప్రచార యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖరారు చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమాలు ఉండబోతున్నట్లు నాదెండ్ల తెలిపారు.