దేశంలోనే మరో విద్యా విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలకబోతోంది.. ఈ రోజు జరిగిన వీసీల సమావేశంలో తన విజన్‌ను స్వయంగా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తొలిసారిగా టీచింగ్, లెర్నింగ్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌తో అనుసంధానం చేయనున్నారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ, అగ్మాంటెడ్ రియాల్టీ, మషిన్ లెర్నిగ్, ఎల్ఎల్ఎం, మెటావర్స్‌తో మిళితం చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.
నా దగ్గర సమర్థత లేకపోతే ప్రధాని ఒక ముఖ్యమంత్రితో పాటు సమానంగా నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం వైఎస్ జగన్ గురించి ప్రధాని దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు.
ఒకరు ఉంటే భార్య అంటారు.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్లాలే అంటూరు అంటూ సెటైర్లు వేశారు ఎంపీ మార్గాని భరత్.. నమస్కారానికి కూడా సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డ ఆయన.. వాలంటీర్లు ఉద్యమిస్తే ఎలా ఉంటుందో పవన్ రుచి చూశాడన్నారు.