Ambati Rambabu: పవన్ కల్యాణ్‌ది శునకానందం.. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పై కౌంటర్ అటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. బ్రో సినిమాను నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను.. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కల్యాణ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.. ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో తాను నటిస్తూ.. నా క్యారెక్టర్ పెట్టి ఆనంద పడుతున్నాడని మండిపడ్డారు. కానీ, నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని, ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్ వేయను.. పవన్ కళ్యాణ్ ది శునకానందం అంటూ దుయ్యబట్టారు. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం.. ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన ఆనందంగా పేర్కొన్న ఆయన.. నా డ్యాన్స్ సింక్ అవ్వలేదట.. నేను ఏమైనా డ్యాన్స్ మాస్టర్ నా? అంటూ నిలదీశారు. అయితే, పవన్ కల్యాణ్ రాజకీయాలకు సింక్ అవ్వడంటూ దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు.
ఇక, పోలవరంపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు అంబటి రాంబాబు.. 1998 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు పోలవరం గురించి ఆలోచించ లేదు? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేని వ్యక్తి బాబు.. గాలేరు-నగరి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకో లేదు? అని నిలదీశారు. అబద్దాలు చెబితే లోకేష్ లాంటి కొడుకు పుడతాడు అంటూ సెటైర్లు వేసిన ఆయన.. చంద్రబాబు మీడియా సమావేశంలో నవరసాలు పండించాడు.. చంద్రబాబు వంటి గొప్ప నటుడిని ఇంత వరకు నేను చూడలేదు.. రాష్ట్రానికి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పట్టిన శని చంద్రబాబు నాయుడు.. 2020లో వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది.. డయాఫ్రమ్ వాల్ ను కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన తర్వాత కట్టాలి.. కానీ, చంద్రబాబు ఎందుకు ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టాడు? అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడంతో నీరు వెళ్ళటానికి దారి మూసుకుని పోయింది.. పోలవరానికి పట్టిన శని చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు.
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
మా ప్రభుత్వమే లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసిందని తెలిపారు అంబటి.. బిల్లులు చేసుకోవటం కోసం, కమీషన్ల కోసం సగం సగం పనులు చేసి డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినటానికి కారణం అయ్యారు అని ఆరోపించారు. చంద్రబాబుది శని కాలు.. ప్రాజెక్టుల దగ్గర పెడితే ఏమవుతుందో అని భయంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు? అని ప్రశ్నించిన ఆయన.. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదని ఎవరైనా చెప్పగలరా? అని నిలదీశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ తో సహా మొత్తం భారం కేంద్రానిదే.. కానీ, తానే కేంద్రాన్ని ఒప్పించానని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. 2016లో ప్రాజెక్టును కేంద్రం నుండి తీసుకుంటూ.. 2013-14 రేట్ల ప్రకారం కట్టుకుంటామని చెప్పారు. ఇది రాష్ట్రానికి, పోలవరానికి చేసిన ఘోర అన్యాయం కాదా?.. నవయుగకు కాంట్రాక్టును మాత్రం 2016 రేట్ల ప్రకారం ఇచ్చాడు అని ఫైర్ అయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే స్వయంగా చెప్పారు.. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. 2018లో పోలవరం పూర్తి చేస్తాం అని అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు.. ఎందుకు పూర్తి చేయలేక పోయారో సమాధానం చెప్పాలన్నారు. నన్ను ఆంబోతు ఆంబోతు అంటున్నాడు.. నేను మాట్లాడలేనా? వయస్సులో పెద్దవాడని గౌరవం ఇస్తున్నా అన్నారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసిన వాడు చంద్రబాబు.. అనలేనా? పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు పిచ్చి మాటలు చెబుతున్నాడు.. అది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు మంత్రి అంబటి రాంబాబు.
https://www.youtube.com/watch?v=jB2XDB7p-rQ
తాజావార్తలు
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!