Bolla Brahmanaidu: పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం విదితమే.. మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులపై అక్రమ కేసులు నిరసిస్తూ టీడీపీ ర్యాలీ నిర్వహించడం.. ఈ ర్యాలీని వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడి.. దాడులకు దారితీసింది.. చివరకు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, ఈ వ్యవహారంపై వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.. టీడీపీ నాయకులే రాళ్ల దాడి చేశారని పేర్కొన్నారు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.. మా ఫ్యాక్టరీలో చొరబడి మా సిబ్బందిని బెదిరించారు.. స్వీడన్ కంపెనీకి చెందిన లక్షల రూపాయల వస్తువులు దొంగ తనంగా తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు.
Read Also: Pakistani Plane: భారత్లోకి ప్రవేశించిన పాక్ విమానం…గంట పాటు 3రాష్ట్రాలపై చక్కర్లు
నేను ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తుంటే అష్ట దిగ్బంధం చేసి నాపై దాడి చేయడానికి యత్నించారని మండిపడ్డారు బ్రహ్మనాయుడు.. వినుకొండలో టిడిపి నాయకులు.. అరాచకం, విధ్వంసం సృష్టించారన్న ఆయన.. టీడీపీ నాయకులే రాళ్ల దాడి చేశారు.. నన్ను వీధి రౌడీ అని అంటున్న టీడీపీ నాయకులు ప్రభుత్వ సొమ్ము కాజేసిన గజ దొంగలు అని విరుచుకుపడ్డారు. ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు ల నుండి డబ్బులు కాజేశారని ఆరోపించారు. నేను ప్రభుత్వ భూములు కాజేసానని నిరూపించండి అంటూ సవాల్ చేశారు. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి నా ఆధీనంలో ఉన్న నా ఆస్తి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తానన్న ఆయన.. రాజకీయలద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కుట్రలో భాగమే వినుకొండ లో జరిగిన విధ్వంసం అన్నారు. నీ కొడుకు రాజకీయ లబ్ధి కోసం ప్రజల ప్రాణాలు ఫణంగా పెడతావా చంద్రబాబు అంటూ నిలదీశారు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.