ఇప్పటికే విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.. ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు.. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు అందించే విధంగా చర్యలు తీసుకోనున్నారు
Group 1 Mains Result Release: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షా ఫలితాలను ప్రకటించింది.. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఈ రోజు గ్రూప్ ఫలితాలను విడుదల చేశారు.. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలు వెల్లడించారు.. గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించినట్టు ఈ సందర్భంగా గౌతం సవాంగ్ పేర్కొన్నారు.. మొత్తంగా గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య 111 ఉండగా.. ఒక పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో…
ఏపీ ట్రాన్స్ కోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2018 రివైజ్డ్ పే స్కేళ్ల ప్రకారం వేతనాలు సవరిస్తూ సీఎం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్సుకోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సవరించినట్టు ఉత్తర్వులు ఇచ్చింది.