చంద్రబాబుతో ఫ్యామిలీ మెంబర్స్ ములాఖత్.. భువనేశ్వరి ఎమోషనల్
రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గుర్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు భువనేశ్వరి.. చంద్రబాబుకు ముందు ప్రజలు.. తర్వాత కుటుంబమన్న ఆయన.. జైలులో కూడా ప్రజల గురించే ఆలోచన చేస్తున్నారని తెలిపారు.. వాళ్లు చెబుతున్నా.. ఆయన భద్రతపైనే మాకు భయం ఉందన్నారు.. జైలులో అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా.. సరైన సౌకర్యాలు లేవన్నారు భువనేశ్వరి.. ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. చంద్రబాబు స్నానం చేయడానికి చన్నీళ్లు ఇస్తున్నారన్నారు.. చంద్రబాబును చూసి జైలు నుంచి బయటకు వస్తుంటే.. నాలో సగ భాగాన్ని వదిలేసి వస్తున్నట్టు అనిపించిందంటూ ఎమోషనల్ అయ్యారు.. ఆయన ఆధునీకరణ చేసిన జైలులోనే చంద్రబాబును ఖైదీగా పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి.
చంద్రబాబు కేసు ఎఫెక్ట్..! ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి భద్రత..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణతో ఒక్కసారిగా విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుపై ఫోకస్ పెరిగింది.. చంద్రబాబు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌తో పాటు.. ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది.. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రత పెంచింది. 4+1 ఎస్కార్ట్‌తో భద్రత కల్పించింది సర్కార్.. కాగా, ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాఖలైన పలు పిటిషన్లపై న్యాయవాది హిమబిందు విచారణ జరుపుతోన్న విషయం విదితమే.. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా.. జస్టిస్ హిమబిందుకు ప్రభుత్వం భద్రత పెంచినట్టు తెలుస్తోంది. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదన్న సీఐడీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. భద్రతపై చంద్రబాబు తరపు లాయర్లు చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిన విషయం విదితమే.
14 ఏళ్ల సీఎంగా చేసిన ప్రతీ పని ఓ స్కామే.. చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్..!
14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతీ పని ఓ స్కామే.. చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు.. నిన్న టీడీపీ బంద్ లో చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కూడా స్పందించి మూయలేదన్నారు.. చంద్రబాబు ఆయన మహానాయకుడు అని నమ్మించే ప్రయత్నం చేసే మీడియా కూడా జీర్ణించుకోలేక పోతున్నారన్న ఆయన.. విద్యార్థి దశ నుంచే నేర పూరిత ఆలోచనలు చేసే చంద్రబాబు.. ఆయన సొంత మీడియా ఆయన విజనరీ ఉన్న నేత అని చేసిన ప్రచారం డొల్ల అని తేలిపోయిందన్నారు. సీమెన్స్ కంపెనీ పెట్టుబడుల్లో లోకేష్ ముఖ్య అనుచరుడు కిలారి రాజేష్ ది ప్రముఖ పాత్ర అని ఆరోపించారు సాయి రెడ్డి.
దేశంలోనే అద్భుతమైంది కల్యాణ లక్ష్మి స్కీం
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కుటుంబాల ఆడపడుచుల పెళ్లిల కోసం దేశంలోనే అద్భుతమైన కల్యాణ లక్ష్మి స్కీం అని ఆయన కొనియాడారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీం ద్వారా లక్ష రూపాయలను సీఎం కేసీఆర్ ఇవ్వాలంటూ తనను దూతగా పంపారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెళ్లి కొరకు లక్ష రూపాయల చేయూత స్కీమును ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే అని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే కరోనా టైంలో కూడా ఆడబిడ్డ పెళ్లిళ్లు ఆగకుండా జరగాలని ఈ స్కీములు కొనసాగించడం సీ ఎం కేసీఆర్ సాహసమని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్క స్కీములను ప్రజలు గుర్తించి సీఎం కేసీఆర్‌కు దీవెనలు అందించాలని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.
మణిపూర్‌లో మళ్లీ హింస.. తాజాగా ముగ్గురు మృతి
మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు. మరోవైపు ఈ దాడిని కాంగ్‌పోక్పికి చెందిన కమిటీ ఆఫ్ ట్రైబల్ యూనిటీ (COTU) ఖండించింది. లోయలోని అన్ని జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్త ప్రాంతాలుగా ప్రకటించాలని సామాజిక సంస్థ పేర్కొంది. మరోవైపు ఘటనా స్థలానికి పోలీసులు, అస్సాం రైఫిల్స్ బలగాలు చేరుకున్నాయి. భద్రత బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని పోలీస్ అధికారి తెలిపారు. మృతులను కుకి గొడుగు సమూహమైన ఇండిజెనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరంకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ముగ్గురు కుకి-జో నివాసితులని, సాయుధ దుండగులు సైనిక దుస్తులు ధరించారని గిరిజన ఐక్యత కమిటీ (COTU) ఒక ప్రకటనలో తెలిపింది.
ఇస్రో ఛైర్మన్ జీతం ఎంతో తెలుసా..? అసలు విషయం బయటపెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త
ప్రముఖ పారిశ్రామికవేత్త.. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. ఎప్పటికప్పుడు ఎన్నో అంశాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటారు.. తాజాగా, ఆయన చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆకట్టుకుటుంది.. అసలు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ నెల జీతం ఎంత? అంటూ నెటిజన్లకు ప్రశ్న వేసిన ఆయన.. ఇస్రో చీఫ్ నెల జీతం గురించి చెబుతూనే ఆయన పంచుకున్న అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ”ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ నెలకు రూ. 2.5 లక్షల జీతం తీసుకుంటున్నారు.. మీరు చెప్పండి. ఇది ఆయనకు సరైన జీతమేనా? అంటూ ప్రశ్నించారు గోయెంకా.. డబ్బే కాకుండా ఉన్నతమైన ఎన్నో అంశాలు ఆయన లాంటి వ్యక్తులను ప్రేరేపిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు అని రాసుకొచ్చారు.. సాంకేతికత, పరిశోధనల్లో అంకితభావంతో ఆయన కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. సోమనాథ్ లాంటి వారు దేశం గర్వపడేలా చేయాలనుకుంటారు.. కాబట్టి ఆయన లాంటి వ్యక్తులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.. మొత్తంగా తన పోస్ట్‌లో, ఇది సరసమైన నెలవారీ ఆదాయమా అని ప్రజలను అడగడమే కాకుండా, సైన్స్ మరియు పరిశోధనపై సోమనాథ్‌కు ఉన్న అభిరుచి గురించి కూడా పేర్కొన్నారు హర్ష్ గోయెంకా.. అయితే, ఈ పోస్ట్ నిన్న (సెప్టెంబర్ 11న) షేర్ చేశారు.. పోస్ట్ చేసినప్పటి నుండి 8.13 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది.. వెయ్యి మందికి పైగా రీ ట్వీట్ చేస్తూ కామెంట్లు పెట్టగా.. 9 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ సెక్షన్‌లో చాలా మంది తమ స్పందనలను కూడా పంచుకున్నారు.
ఎంపీల గుట్టు విప్పిన నివేదిక.. అంతా కోటీశ్వరులే.. 40 శాతం సిట్టింగ్‌లపై క్రిమినల్ కేసులు
40 శాతం మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, వీరిలో 25 శాతం మంది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ మరియు మహిళలపై నేరాల కింద తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. లోక్‌సభ, రాజ్యసభలోని 763 మంది సిట్టింగ్ ఎంపీలలో 306 మంది అంటే 40 శాతం మంది ఎంపీలపై హత్యలు, మహిళలపై అత్యాచారం లాంటి నేరారోపణలతో క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తాజా అధ్యయనం దేశంలోని సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుల క్రిమినల్ బ్యాగ్రౌండ్ కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. మంగళవారం విడుదల చేసిన ఏడీఆర్ నివేదిక ప్రకారం.. లోక్‌సభ, రాజ్యసభలోని 763 మంది ఎంపీలలో 306 (40 శాతం) మంది తమపై హత్యలు, మహిళలపై దాడి లాంటి నేరారోపణలు ఉన్నట్లు నేతలు స్వయంగా ప్రకటించారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి ఒక్కో ఎంపీ సగటు ఆస్తుల విలువ రూ. 38.33 కోట్లు కాగా, 53 మంది (ఏడు శాతం) బిలియనీర్లుగా ఉన్నారని ఏడీఆర్ తెలిపింది.
సినీపరిశ్రమలో తీవ్ర విషాదం.. చిరంజీవి సినిమాల నిర్మాత మృతి!
బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘గో గోవా గాన్’, ‘ఏక్ విలన్’ సినిమాల నిర్మాత ముఖేష్ ఉదేషి ఈ లోకానికి వీడ్కోలు పలికారు. ఈ వార్త విని బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. ముఖేష్ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప బాలీవుడ్ చిత్రాలను కూడా నిర్మించారు. ఇందులో ‘ది విలన్’ అలాగే ‘కలకత్తా మెయిల్’ ఉన్నాయి. దివంగత నిర్మాత ముఖేష్ గురించి ఆయన సన్నిహితుడు ప్రవేష్ సిప్పీ గురించి మాట్లాడుతూ, “ముఖేష్ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో చెన్నైలో కిడ్నీ మార్పిడికి సిద్ధమవుతున్నాడు. కానీ ఆపరేషన్‌కు కొన్ని రోజుల ముందు ఆయన మరణించాడు” అని వెల్లడించాడు. ఇక మారిషస్‌లో చిత్రీకరించబడిన చాలా బాలీవుడ్ చిత్రాలకు ముఖేష్ ఉదేషి లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా ఉన్నారు. నిర్మాత అంత్యక్రియల గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ముఖేష్ ఉదేషి గత రాత్రి అంటే సెప్టెంబర్ 11 న తుది శ్వాస విడిచారు. నిర్మాత మృతి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తతో బి-టౌన్ ప్రముఖులతో పాటు, వారి అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రామ్ గోపాల్ వర్మ ‘కౌన్’ చిత్రానికి ముఖేష్ ఉదేశి సహ నిర్మాత కూడా అని మీకు తెలియజేద్దాం. ఈ చిత్రంలో ఊర్మిళా మటోండ్కర్, మనోజ్ బాజ్‌పేయి తమ అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఇది కాకుండా, చిరంజీవి హీరోగా హిందీలో చేసిన ప్రతి బంధ్, ద జెంటిల్ మ్యాన్, ఎస్పీ పరశురామ్ లాంటి సినిమాలను అల్లు అరవింద్ తో కలిసి ఆయన నిర్మించారు. ముఖేష్ ఉదేశికి విదేశాల్లో చలనచిత్ర నిర్మాణం, చిత్రీకరణలో ఆయనకు 37 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది.
నడి రోడ్డుపై స్టన్నింగ్ పోజులతో రెచ్చిపోయిన ఇస్మార్ట్ బ్యూటీ..
యంగ్ బ్యూటీ నభా నటేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కన్నడ చిత్రం తో నటి గా సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయిన నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు లో ఈ భామ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.ఉస్తాద్ రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో నే నభా నటేష్ మంచి క్రేజ్ ను దక్కించుకుంది.ఇస్మార్ట్ శంకర్ సినిమా తో వచ్చిన ఫేమ్ ను నభా బాగా వినియోగించుకునే ప్రయత్నం చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత నభా నటేష్ ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి చిత్రాల్లో నటించింది.కానీ ఆమె చేసిన ఆ సినిమాల ఫలితాలు ఆశించిన మేర లేకపోవడం తో ఈ భామకు సినిమా ఆఫర్స్ తగ్గాయి. నభా నటేశ్ ప్రస్తుతం సినిమాల పరంగా ఎలాంటి జోరు చూపించడం లేదు. కానీ సోషల్ మీడియా లో మాత్రం నయా లుక్స్ లో మెరుస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది. వరుస ఫొటోషూట్ల తో అదరగొడుతోంది.సోషల్ మీడియా లో నభా నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ సరికొత్త లుక్ లో మైమరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ల లో రెచ్చగొడుతుంది..అదిరిపోయే హాట్ ఫొటోషూట్ల తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.తాజాగా అవుట్ డోర్ షూట్ తో అట్రాక్ట్ చేసింది నభా.టూర్ కు వెళ్తున్న ఈ బ్యూటీ.. మధ్యలో నడిరోడ్డుపైనే ఆగి ఫొటోషూట్ ను చేసింది. తన నాభీ అందాలు కనిపించేలా వైట్ క్రాప్డ్ టాప్ మరియు కార్గో జీన్స్ ధరించి ట్రెండీ లుక్ లో కిర్రాక్ ఫోజులిచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.
అబ్బా.. ఇలా చేస్తే ఎలా అనుపమా.. కుర్రాళ్లు ఏమైపోతారు..
అనుపమా పరమేశ్వరన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తనలోని నటనను బయటపెడుతూ ఆకట్టుకుంటుంది.. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే.. ఫోటోషూట్, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. తాజాగా బ్లూ చీరలో నెమలిలా అద్భుతమైన డ్యాన్స్ చేసింది అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల ఓనమ్ సెలబ్రేషన్ సమయంలో పాట పాడి ఆడియన్స్ ని ఫిదా చేసిన అనుపమ.. ఇప్పుడు డాన్స్ తో అక్కట్టుకుంటుంది. తాజాగా చీరకట్టుతో డాన్స్ వేసి వావ్ అనిపిస్తుంది.. ప్లేయిన్ బ్లూ శారీలో నడుము అందాలు చూపిస్తూ.. అనుపమ వేసిన సింపుల్ స్టెప్స్ ప్రతి ఒక్కర్ని మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో అనుపమ డాన్స్ కి లైక్స్ తో సమాధానం ఇస్తూ వస్తున్నారు..
రాయల్ లుక్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ చరణ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, జయరామ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన.. లీక్ అయిన ఫొటోస్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో చరణ్ తండ్రీకొడుకులుగా కనిపించనున్నాడు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అభిమానులు మాత్రమే కాదు చరణ్ కూడా గేమ్ ఛేంజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా రిజల్ట్ పైనే అందరి చూపు ఉంది. ఇక ఈ మధ్యనే ఒక ఏడిద షెడ్యూల్ ను పూర్తిచేసిన చరణ్ కొద్దీ రోజులు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి భార్య ఉపాసనతో కలిసి ప్యారిస్ ట్రిప్పుకు వెళ్లాడు. స్నేహితుల పెళ్లిలో మిస్టర్ అండ్ మిస్సెస్ చరణ్ సందడి చేశారు. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత రామ్ చరణ్ దంపతులు.. నవ దంపతులతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక రాయల్ లుక్ లో రామ్ చరణ్ దంపతులు ఎంతో అందంగా ఉన్నారు. ముఖ్యంగా చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. గోల్డ్ కలర్ డ్రెస్ లో చరణ్ మెరిసిపోతున్నాడు. ఇక ఈ లుక్ చూసిన అభిమానులు చరణ్ లుక్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరో రెండు రోజుల్లో చరణ్ దంపతులు ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఇండియా వచ్చాక ఆర్సీ మళ్లీ షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. మరి ఈ సినిమాతో జక్కన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి నిజంగానే చరణ్ గేమ్ ఛేంజర్ అవుతాడేమో చూడాలి.