కొడాలి నాని, పార్థ సారథి, వంగవీటి రాధాకు అరెస్ట్ వారెంట్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు నేతలు.. అయితే, దీనిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.. అదే కేసులో ఈ రోజు విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యే కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.. వైసీపీ నేతలు కొడాలి నాని, పార్థ సారథి, అడపా శేషులతో పాటు ప్రస్తుంత తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధాకు కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. కాగా, కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉంది. వాయిదాలకు కొడాలి నాని రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి 2016 మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నాని, మరికొందరు నాయకులు ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే కారణంగా కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరుకాక పోవడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.
చంద్రబాబు కేసులో సంచలన తీర్పు..
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ న్యాయస్థానంలో షాక్ తగిలింది.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం.. ఆ తర్వాత ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విదితమే కాగా.. అయితే, చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం, సెక్యూరిటీ దృష్ట్యా.. ఆయనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. అయితే, చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. రెండు రోజుల పాటు ఓవైపు సీఐడీ తరపు న్యాయవాదులు.. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించారు.. ఇక, కాసేపటి క్రితమే తీర్పు వెలువరించింది ఏసీబీ కోర్టు.. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది ఏసీబీ కోర్టు.. సీఐడీ వాదనలతో ఏకీభవిచింది.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ముప్పులేదన్న సీఐడీ వాదనాలు ఏకీభవించింది.. కానీ, భద్రతపై చంద్రబాబు లాయర్ల వాదనతో విభేదించింది.. ఇదే సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేపర్ల పరిశీలనకు చంద్రబాబు లాయర్లకు అనుమతి ఇచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.
కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదు
కేటీఆర్.. రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు అమెరికాలో ఉన్నాడని, రెండో దశ ప్రక్రియ మొదలు కాగానే వచ్చాడు కేటీఆర్ అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం మాతో పొత్తు పెట్టుకున్నాడని, వైఎస్ వద్దు అన్నా.. ఎదిరించి మాట్లాడామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అంటే.. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినట్టు ఉందంటున్నాడని, కేటీఆర్ .. మీ తండ్రి మొదటి సభలో చెప్పిన మాటలు విను… కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పిల్లలు చనిపోతున్నారు అని తెలంగాణ ప్రకటన చేశారు సోనియాగాంధీ అని, తెలంగాణ పేరుతో కేటీఆర్.. లక్షల కోట్లకు ఎదిగాడని ఆయన ఆరోపించారు.
సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్
సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏక మొత్తంలో ఒకేసారి ఏరియర్స్ సింగరేణిలో ఉద్యోగులకు, కార్మికులకు చెల్లించేలా సింగరేణి సర్క్యులర్ విడుదల చేసింది. ఈనెల 21న ఉద్యోగులందరికీ చెల్లింపు చేయనున్నట్లు సర్క్యులర్ లో సింగరేణి యాజమాన్యం పేర్కొంది. దీంతో.. ఒక్కో కార్మికుడికి దాదాపుగా 4 లక్షల మేర ఏరియర్స్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 వేల ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. సీఎం కేసీఆర్, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత ప్రత్యేకత చొరవతో నాయకుల కృషితో ఒకేసారి కార్మికులకు ఎరియర్స్ బకాయిలు అందనున్నాయి. 23 నెలల ఏరియర్స్ చెల్లింపు లో 23 నెలల సీఎంపీఎఫ్ షేర్, ఇంకామ్ టాక్స్ వాటి బకాయిలు తీసుకొని మిగతా బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే.. ఒకేసారి ఏరియర్స్ విడుదల చేయడంపై ఉద్యోగులు, కార్మిక నాయకుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది “మహా భూమి”.. గ్రహం నిండా సముద్రాలే.. జీవం ఉంటుందా..?
విశ్వం అంతా మహాసముద్రం అనుకుంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం ఒక నీటి చుక్క మాత్రమే. ఇంత పెద్దదైన బ్రహ్మాండంలో భూమిలాంటి గ్రహాలు లక్షల్లో ఉన్నా కూడా వాటిని మనం గుర్తించలేము. ఎందుకంటే మన సూర్యుడు ఉన్న మిల్కీవే గెలాక్సీలోనే కొన్ని మిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. మిల్కీవే గెలాక్సీని దాటాలంటేనే కొన్ని వేల ఏళ్ల కాంతి సంవత్సాల సమయం పడుతుంది. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం భూమి లాంటి గ్రహాలను కనుగొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని వందల సంఖ్యలో ఎక్సో ప్లానెట్లను కనుగోన్నారు. అయితే తాజాగా K2-18 b అనే భూమి లాంటి గ్రహాన్ని గురించి శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. భూమికి 120 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కూల్ మరుగుజ్జు నక్షత్రం K2-18 చుట్టూ తిరుగుతోంది. ఈ గ్రహం కూడా భూమిలాగే నివాసయోగ్యమైన జోన్ లో ఉంది. భూమితో పోలిస్తే దాదాపుగా 8.6 రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంది. ఈ గ్రహం మొత్తం మహాసముద్రాలతో నిండిపోయి ఉంది.
వాట్ ఏ టాలెంట్ గురూ.. నాలికతో గీసిన అద్భుతమైన కోహ్లీ చిత్రం..
క్రికెటర్స్ కూడా అభిమానులు ఎక్కువగా ఉంటారు.. వాళ్లు బరిలోకి దిగితే ఇక గెలవాలని ఎంతగా కోరుకుంటారో.. అందులో భారత క్రికెటర్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా కూడా అతను నాలికతో వెయ్యడం పై విమర్శలు అందుకున్నాడు.. అతను బొమ్మ గీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ముఫద్దల్ వోహ్రా అనే ట్విట్టర్ యూజర్ ఓ గుర్తు తెలియని ఆర్టిస్ట్ తన నాలుక కొనలను ఉపయోగించి విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీసే వీడియోను షేర్ చేసాడు. ఈ క్లిప్ వైరల్ అవుతోంది. ‘విరాట్ కోహ్లీని ఓ అభిమాని తన నాలుకతో కళాత్మకంగా తీర్చిదిద్దాడు’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ విచిత్రమైన పెయింట్ రుచి గురించి అడిగారు. కొందరు అతని టాలెంట్‌ను మెచ్చుకుంటే మరికొందరు పెదవి విరిచారు.. అభిమానం ఉంటే ఇలా చేస్తారా.. అని రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు..
అరుదైన ఘనత.. వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన ‘హిట్’ మ్యాన్
ఆసియా కప్ 2023లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10 వేల పరుగుల మార్కును దాటాడు. రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగులు చేసిన ఘనత సాధించాడు. శ్రీలంకపై సిక్సర్ కొట్టి.. 22వ పరుగులు చేసిన వెంటనే రోహిత్ శర్మ ఈ మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన మూడో వ్యక్తిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి 205 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగులను అధిగమించాడు. ఈ జాబితాలో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. 10వేల మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్ గా, ఓవరాల్ గా 15వ బ్యాటర్ గా హిట్ మ్యాన్ రికార్డులకెక్కాడు.
అడ్డాలకు హ్యాండ్ ఇచ్చింది ఈ నటుడే.. ?
మంచితనానికి మారుపేరులా ఉండేవాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కుటుంబం, బంధం.. బంధాలు అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్స్ తీసి ప్రేక్షకులను బంధాలతోనే కట్టిపడేసేవాడు. అలాంటి డైరెక్టర్ నారప్ప సినిమాతో మాస్ లోకి దిగాడు. ఒక క్లాస్ డైరెక్టర్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో నారప్పతో చూపించాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా రీమేక్ అయినా కూడా వెంకీ స్క్రీన్ ప్రెజెన్స్.. అడ్డాల చూపించిన విధానానికి తెలుగువారు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తరువాత దాన్ని మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్దకాపు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో విలన్ గా శ్రీకాంత్ అడ్డాలనే కనిపించడంతో సినిమాపైమరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే మొదట శ్రీకాంత్ ఈ సినిమాలో నటించాలని అనుకోలేదట. ఒక మలయాళ స్టార్ నటుడును దించాలని చూశాడట. చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇచ్చేసరికి ఆ పాత్ర ఆయన చేయక తప్పలేదని సమాచారం.
మళ్లీ తల్లి కానున్న జెనీలియా అంటూ వార్తలు.. అసలు విషయం ఇదేనట!
జెనీలియా డిసౌజా అంటే గుర్తు పట్టడానికి కొంత సమయం పడుతుందేమో కానీ బొమ్మరిల్లు హాసిని అంటే తెలుగు ప్రేక్షకులందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు. అలా తెలుగు వారికీ చేరువైన ఆమె తెలుగులో స్టార్ హీరోలతో సైతం నటించి మంచి హిట్స్ ను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనతో మొట్టమొదటి సినిమా చేసిన బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు బాయ్ చెప్పేసి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి వారి ఆలనాపాలనా చూసుకుంటోంది. పిల్లలు స్కూల్ కి వెళ్లే వయసు రావడంతో జెనీలియా, రితేష్ కలిసి మన మజిలీ సినిమాని రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె ప్రెగ్నెంట్ అయింది అనే వార్తలు తెర మీదకు వచ్చాయి. తాజాగా ముంబైలో జెనీలియా, రితేష్ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు, ఈ క్రమంలో ఆమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించిందని భావించి కొందరు ఆమె ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ పుకార్లను జెనీలియా భర్త రితీష్ దేశ్‌ముఖ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొట్టిపారేశాడు. జెనీలియా గర్భవతిగా ఉందా అని అడిగే పోస్ట్‌కు రితేష్ స్పందిస్తూ, “ మరో 2-3 పిల్లలు ఉన్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దురదృష్టవశాత్తు ఇది అవాస్తవం” అని రాసుకొచ్చారు. 2012లో వివాహం చేసుకున్న జెనీలియా, రితీష్‌లకు రియాన్ మరియు రహిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జెనీలియా ఇటీవల ఒక ఈవెంట్‌లో తన దుస్తులను తన పొట్టపై మళ్లీ మళ్లీ సర్దుకునే ప్రయత్నం చేయడంతో ఆమె మూడవ గర్భం గురించి ఈ పుకార్లు మొదలయ్యాయి. “బాయ్స్”, “సై”, “బొమ్మరిల్లు”, “ఢీ” సహ “రెడీ” వంటి అనేక తెలుగు బ్లాక్ బస్టర్స్ లో కనిపించిన జెనీలియా తన పెళ్లి తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు.