ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గత రెండు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. దీంతో మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లు ఆయనకు అపెండెక్టమీ సైతం రోబో సాయంతో చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను డాక్టర్లు డిశ్ఛార్జ్ చేశారు.
మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. విద్యాశాఖలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పన అనే చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాము.. ఐబీ సిలబస్ కు లెటర్ ఆఫ్ ఇండెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.