కృష్ణాజలాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రం తాజా విధివిధానాల జారీ నేపథ్యంలో ఈ మీటింగ్ జరిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. కృష్ణా నదీజలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించిన సీఎం.. KWDT-2 తీర్పుద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన అంశంపైనా చర్చ.. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమంటూ సమావేశంలో చర్చ.. రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Congress: పాలస్తీనాకు కాంగ్రెస్ మద్దతు.. సీడబ్ల్యూసీలో తీర్మానం!
కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని అధికారులు తెలిపారు. సెక్షన్ 89లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని అధికారులు అన్నారు. రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెప్తుందని, ఇప్పుడు దాన్ని ఉల్లంఘించేలా అధికారులు ఉందన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్ ఉండగా కూడా గెజిట్ విడుదలచేశారన్నారు. అలాగే అంతర్ రాష్ట్ర నదీజల వివాదాల చట్టంలో క్లాస్ లను కూడా ఉల్లంఘించి ఈ విధివిధానాలను అధికారులు జారీ చేశారని తెలిపారు. 2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా.. దీనికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు చేసిందని అధికారులు చెప్పారు.
Read Also: Rashid Khan: మంచి మనసు చాటుకున్న రషీద్ ఖాన్.. భూకంప బాధితులకు విరాళం
అలాగే, గోదావరి నదీజలాల కేటాయింపుల్లో ఇంకో బేసిన్‌కు తరలించుకోవచ్చన్న వెసులుబాటుతో మన రాష్ట్రం పోలవరంనుంచి తరలించే నీటిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తెలంగాణకు కృష్ణానదిలో అదనపు కేటాయింపులు చేయడం సమంజసం కాదని, ఇది రాష్ట్రానికి నష్టమని అధికారులు తెలిపారు. అదే తెలంగాణ 214 టీఎంసీలు తరలిస్తున్నా.. ఆ మేరకు ఏపీ వాటాలపై మౌనం విధివిధానాల్లో వహించడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ వద్దని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. దీంతో పాటు మార్గదర్శకాలపై గెజిట్ వెలువడిన నేపథ్యంలో మరోసారి ప్రధాన మంత్రికి, హోంమంత్రికి లేఖలు రాయాలని కూడా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.