CM YS Jagan: సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకుని ఉండొచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ప్రారంభంలో కొంతమంది ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకుని ఉండొచ్చు.. వైఎస్ జగన్ ఏంటి..? ఇలా తిరగమంటున్నాడు..? అని అనుకుని ఉండొచ్చు.. కొంత బాధ కూడా పడి ఉండొచ్చు.. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాయకులు నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ కేవలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే అన్నారు.. అందుకే ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు సీఎం జగన్.. ఇక, ఈ సభకు రాలేకపోయిన వారందరూ నా దళపతులే.. ప్రజలతోనే మన పొత్తు.. నా నమ్మకం, నా ధైర్యం మీరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. పార్టీ శ్రేణులకు వరుసగా కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించారు సీఎం జగన్.. జనవరి 1 నుంచి మరో మూడు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.. జనవరి 1 నుంచి వృధ్ధాప్య పెన్షన్ పెంపు.. పది రోజుల పాటు పెన్షన్ పెంపు సంబరాలు.. రెండో కార్యక్రమం వైఎస్సార్ చేయూత.. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు.. ఐదు వేల కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో వేస్తాం.. ఈ ఒక్క పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలకు 19వేల కోట్లు ఇచ్చినట్లు అవుతుంది.. పది రోజుల పాటు సంబరాలు.. మూడవ కార్యక్రమం వైఎస్సార్ ఆసరా.. జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్సార్ ఆసరా.. ఫిబ్రవరిలో మ్యానిఫెస్టోను ప్రజలకు తీసుకుని వెళ్ళే కార్యక్రమం .. మార్చి నెలలో ఎన్నికలకు సన్నద్ధం అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం వైఎస్ జగన్.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?