ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆన్లైన్లోనే గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తోంది.. దీని కోసం ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించింది.. సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లోనే అన్ని అనుమతులు పొందేలా ఏర్పాట్లు చేసింది..
తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు.. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.. రాత్రి శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపి హంగామా చేశారని.. శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటున్నారు ఫారెస్ట్ బీట్ సిబ్బంది.
రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. అతడికి పెరోల్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించడమే కాదు.. అతడి సహకారంతో నేరాలకు పాల్పడుతోందనే ఫిర్యాదులతో రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్, కిలాడీ లేడీ నిండిగుంట అరుణపై కేసులు నమోదు చేశారు..
పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక సిద్ధం చేస్తున్నారు.. శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయబోతున్నారు పవన్ కల్యాణ్..
CM Chandrababu: మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రతన్ టాటా గొప్ప వ్యక్తి.. ఆయన సిoప్లీ సిటీ ఎంతో గొప్పది.. ఆయనతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది.
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత 15 రోజుల్లో టమాటా ధర డబుల్ అయిపోయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది.
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల అయ్యారు. 86 రోజుల పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.