బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెగని రీతిలో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచింది. విజయవాడలో ఉదయం నుంచి కంటిన్యూస్గా వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మూడు రోజుల జనసేన పండుగకు విశాఖ నగరం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత పార్టీలో పరిస్థితులను సమీక్షించుకునేందుకు జరుగుతున్న సమావేశాలు కావడంతో శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. ఇవాళ, రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరుగుతుంది.
* నేటి నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ * తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక.. భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన * తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. నేడు ఏరియల్…
అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం మొదలైంది.. పరవాడ మండలం, మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం.. అయితే వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్.. తిరుపతికి వచ్చారు.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థి...
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా-పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకు అల్పపీడనం ఏర్పడింది. క్రమేపీ బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ ప్రకటించింది. అల్పపీడన ప్రాంతం నుంచి రుతుపవన ద్రోణి ఒకటి సంబల్పూర్ మీదుగా వ్యాపించింది.
వినాయక చవితి రోజు బాపట్ల జిల్లాలో విషాద ఘటన జరిగింది.. తామర పూల కోసం వెళ్లి చెరువులో పడి ఇద్దరు బాలురు ప్రాణాలు విడిచారు.. ఈ ఘటనలో బాపట్ల జిల్లాలోని పూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మృతిచెందారు.. వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. తామర పూల కోసం చెరువులోకి దిగారు ఇద్దరు బాలురు.. మృతులు పూండ్ల గ్రామానికి చెందిన 17 ఏళ్ల సైకం నాగభూషణం, 15 ఏళ్ల సుద్దపల్లి శ్రీమంత్ గా గుర్తించారు.
నాగర్సోల్ నుంచి నరసాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు తెల్ల వారుజామున 2.47 గంటలకు నడికుడి రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో దుండగులు పట్టాల పక్కన హోమ్ సిగ్నలింగ్ను ట్యాంపర్ చేశారు.