రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ దరఖాస్తుదారులకు వరంలా మారిందని, లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు లైసెన్స్ ఫీజును బార్ యజమానులు ఆరు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించడంతో వారికి ఆర్థికంగా లాభదాయకంగా మారనుందని ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ ప్రకారం భారీగా తగ్గనున్నది లైసెన్స్ ఫీజు .. లైసెన్స్ ఫీజును తగ్గించడంతో పాటు ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం..…
నేరాలు చేసిన వారిని జైలుకు తరలిస్తే.. సత్ప్రవర్తనతో బయటకు వస్తారు. తద్వారా సమాజంలో నేరాలు తగ్గుతాయని చెబుతుంటారు. కానీ చాలా వరకు దానికి భిన్నంగా జరుగుతోంది. నేరాలు చేసి జైలుకు వెళ్లి.. తిరిగి వచ్చేటప్పుడు కొత్త స్నేహాలతో బయటకు వస్తున్నారు. అంతే కాదు.. అక్కడ ఏర్పడిన పరిచయాలతో మళ్లీ నేరాలతో దూసుకుపోతున్నారు క్రిమినల్స్. ఇప్పుడు విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో సరిగ్గా ఇలాగే జరిగింది. Also Read:Airtel: యూజర్లకు ఎయిర్టెల్ షాక్.. ఆ చౌకైన ప్లాన్ తొలగింపు! దీనికి…
కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ లో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొంటు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సాయి కిరణ్ అనే యువకుడు. మంగళవారం ఉదయం 1600 మీటర్ల పరుగు పందెం జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరి నాయుడుపేట గ్రామానికి చెందిన యువకుడు సాయి కిరణ్. వెంటనే యువకుడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. యువకుడి మృతి తో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల…
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూన రవికుమార్ మాట్లాడుతూ.. నాపై కెజిబివి ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారు.. సభ్య సమాజం ఆమె ఆరోపణలు చూసి తలదించుకునే విధంగా ఉన్నాయి.. జెడ్పిటిసి నుంచి ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించాను.. నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం దారుణం.. వైసీపీ తోక నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నేను శారీరకంగా మానసికంగా హింసించినట్టు ఆధారాలు చూపించు.. తల్లిదండ్రుల ఫిర్యాదులు వస్తే…
హోంమంత్రి అనిత ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి 21 మంది సీఎం లను చూశాం. కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే టక్కున చంద్రబాబు గుర్తొస్తారు.. ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నా ప్రజలకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పని చేస్తారు.. 14 ఏళ్ల సీఎం చంద్రబాబు ప్రయాణంలో సంక్షేమం.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.. ఈ నెలలోనే అన్నదాత సుఖిభవ..స్త్రీ శక్తి పథకాలను ప్రారంభించాము.. ఈ 14 నెలల్లో…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ ఎం ఎం సుందరేష్, ఎంకే సింగ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.. ఈ కేసులో తదుపరి సీబీఐ విచారణ అవసరమా? లేదా? అనేదానిపై సమయం కోరారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కే ఎస్ ఎన్ రాజు.. దీంతో, తదుపరి విచారణ పై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..