తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అనుమతి ఇచ్చినా.. తెలుగుదేశం నాయకుడు పొట్టి రవిని తాడిపత్రికి రానివ్వలేదని గుర్తుచేశారు.. అయితే, పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా పెద్దారెడ్డి వల్ల నష్టపోయిన బాధితులే అడ్డుకుంటారని పేర్కొన్నారు.. అధికారం అడ్డం పెట్టుకొని పెద్దారెడ్డి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయన్న ఆయన.. మహిళలు అని చూడకుండా టీడీపీ మహిళా కౌన్సిలర్లను పరిగెత్తించి కొట్టిన ఘనత పెద్దారెడ్డిది…
కృష్ణమ్మ కుప్పం చేరుకుంది.. కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది.. దీంతో, కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. హంద్రీ - నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరాయి కృష్ణా జలాలు..
రాజ్యాధికారం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యులను చంపే సంప్రదాయం మా ఇంట్లో లేదు అని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి.. రౌడీ షీటర్లు నా తమ్ముడు గిరిధర్ రెడ్డి అనుచరులు అని ఓ మీడియా రాసిందని మండిపడ్డారు.. విద్యార్ది దశలోనే ఎన్నో పోరాటాలు చేశాను. రౌడీలకు, గుండాలకు భయపడనన్న ఆయన.. వైఎస్ జగన్ ని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేశాను.. 16 నెలలు అధికారాన్ని వదులుకుని టీడీపీలో చేరాను. వైస్సార్సీపీకి సవాల్ విసిరుతున్నా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా..…
సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కౌంటర్‌కు దిగారు.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక చాలా సంతోషించాం.. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు.. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం 5 ఎకరాలు భూమి, 5 స్థలం, ఉద్యోగం ఇచ్చారు.. అది కూడా జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు.. నా కూతురుకు ఇదే న్యాయం చేసినట్టా? అని ప్రశ్నించారు. అయినా, నేను డబ్బుకోసం పోరాటం…
కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగుపెట్టింది. హంద్రీ - నీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ గుండా కృష్ణా జిల్లాలు కుప్పంలో అడుగుపెట్టాయి. పరమ సముద్రం అనే గ్రామం వద్ద నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పంకు వెళ్లి పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు హారతులు పట్టి స్వాగతం పలకనున్నారు. తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు…
విశాఖ వేదికగా 'సేనతో సేనాని' కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. రెండురోజుల పాటు సాగిన ఈ సమావేశాలు.. ఇవాళ బహరంగసభతో ముగియనున్నాయి.. సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు..