AP Metro Rail: ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి కీలక ప్రకటన చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్లకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక, విజయవాడ మెట్రో రైల్ టెండర్ల గడువు అక్టోబర్ 14వ తేదీ వరకు పొడిగించగా, వైజాగ్ మెట్రో రైల్ టెండర్ల గడువు అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించబడింది అన్నారు. అయితే, టెండర్ల ప్రీ-బిడ్ మీటింగ్‌లో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Read Also: Mallikarjun Kharge: ట్రంప్ స్నేహంతో నష్టం, మోడీ దేశానికి శత్రువుగా మారారు..
అయితే, విశాఖపట్నంలో మెట్రో రైల్ ఫేజ్ 1 కింద 46.23 కిమీ తొలి దశ నిర్మాణానికి టెండర్లు పిలవగా, విజయవాడలో మెట్రో రైల్ ఫేజ్ 1 కింద 38 కిలో మీటర్ల మేర నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో ప్రాజెక్ట్ వేగవంతమైన అభివృద్ధికి మేలు చేస్తుందని, గడువు పొడిగింపు ద్వారా కాంట్రాక్టర్లకు సమయం సమకూర్చే అవకాశం లభిస్తుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి తెలిపారు.