నేడు గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్–2, 3 ప్రాజెక్ట్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేడు గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2,3 ప్రాజెక్టు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి నగరానికి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు. అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో రెండున్నర టీఎంసీలు మూసీ ప్రక్షాళన & జంట జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు. ప్రస్తుతం నగరానికి వివిధ ప్రాజెక్టుల ద్వారా 580 నుంచి 600 ఎంజీడీల నీటి సప్లై చేపడుతున్నారు. భవిష్యత్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని మల్లన్నసాగర్ నుంచి మరో 300 ఎంజీడీల నీటిని నగరానికి తరలించేందుకు ప్రణాళికలు చేపట్టారు. ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేసిన వాప్‌కోస్ కంపెనీ.. ఘన్‌పూర్, శామీర్‌పేట్ వద్ద 1,170 ఎంఎల్డీల సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయనున్నారు. ఘన్‌పూర్ నుంచి ముత్తంగి వరకు భారీ పైప్‌లైన్, పంప్ హౌజ్‌లు, సబ్‌స్టేషన్లు నిర్మాణం చేయనున్నారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి 300 ఎంజీడీల నీటి సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. మైనర్ బాలికను గర్భవతిని చేసి.. చివరకు
కరీంనగర్ జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. వీణవంక మండలానికి చెందిన మైనర్ బాలికను రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురిమిండ్ల శ్రీనివాస్ (32) పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాలిక కుటుంబ సభ్యులు వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతి చేసిన వ్యక్తి పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు.
తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం.. సర్వదర్శనం టోకెన్లు రద్దు..
తిరుమలలో చంద్రగ్రహణం ముగియగానే ఆలయ ద్వారాలు మళ్లీ భక్తుల కోసం తెరుచుకున్నాయి. గ్రహణం కారణంగా మూసివేసిన ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాల అనంతరం తిరిగి ప్రారంభించారు. గ్రహణం వీడిన వెంటనే ఆలయంలో సంప్రోక్షణ, పవిత్ర కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం కలియుగ దైవం శ్రీనివాసుడికి ఏకాంతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. అయితే, ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేయడం జరిగింది అని టీటీడీ అధికారులు తేల్చి చెప్పారు. అలాగే, శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు జారీ చేసే టోకెన్లు కూడా రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలియజేశారు. సాధారణంగా తెల్లవారుజామునే శుద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి ఆలయ ద్వారాలను తెరిచారు. గ్రహణం కారణంగా ఏర్పడిన ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య, తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక.. సీక్రెట్ బ్యాలట్ విధానంలో..
భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 అంటె రేపు ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”గా వ్యవహరించనున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడి. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”కు సహాయకులుగా మరో ఇద్దరు “ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు” నియమించారు. ఓటు వృధా కాకుండా ముందు జాగ్రత్తగా అధికార, ప్రతిపక్ష కూటములు “మాక్ ఓటింగ్” నిర్వహించారు. పార్టీలు జారీ చేసే “విప్” లు చెల్లవు..“సీక్రెట్ బ్యాలట్” విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార “ఎన్.డి.ఏ” కూటమి అభ్యర్థి గెలుపు పై ధీమా ఉన్నా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న బిజేపి. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనం లోని “సెంట్రల్ హాల్” లో “మాక్ ఓటింగ్” లో “ఇండియా” కూటమి పక్షాల ఎంపీలు పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం “ఎన్.డి.ఏ” కూటమి పక్షాల ఎంపీల “మాక్ ఓటింగ్”. పార్లమెంటు ఉభయ సభలు—లోకసభ, రాజ్యసభ—కు చెందిన సభ్యులతో పాటు, నామినేటెడ్ సభ్యులు కూడా ఓటర్లుగా ఉండనున్నారు.
‘ఇది నా చివరి హెచ్చరిక..’ హమాస్ కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్
గాజాలో బందీలను విడుదల చేసే ఒప్పందానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం హమాస్‌కు ‘తుది హెచ్చరిక’ జారీ చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో “ఇజ్రాయెల్ నా షరతులను అంగీకరించింది. ఇప్పుడు హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది” అని రాసుకొచ్చారు. ‘ షరతులను అంగీకరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నేను హమాస్‌ను హెచ్చరించాను. ఇది నా చివరి హెచ్చరిక, ఇక మరో అవకాశం ఉండదు!’ అని తెలిపారు. ట్రంప్ శనివారం హమాస్‌కు కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను ప్రతిపాదించారని ఇజ్రాయెల్‌కు చెందిన N12 న్యూస్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్‌లో ఉంచిన వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి బదులుగా, కాల్పుల విరమణ మొదటి రోజున హమాస్ మిగిలిన 48 మంది బందీలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో, గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించడంపై చర్చలు జరుగుతాయి. రాయిటర్స్ ప్రకారం, ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ‘తీవ్రంగా పరిశీలిస్తోందని’ ఇజ్రాయెల్ అధికారి ఒకరు చెప్పారు, కానీ దానిని వివరించలేదు. ఆదివారం, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ మాట్లాడుతూ, హమాస్ బందీలను విడుదల చేసి, ఆయుధాలు వదిలివేస్తే, గాజాలో యుద్ధం ముగియవచ్చని అన్నారు.
తెలుగులోకి సైలెంట్ గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన డబ్బింగ్ సినిమా
మలయాళ ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి నిర్మాతగా హలొ, చిత్ర లహరి ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కెరీర్ బెస్ట్ పారామెన్స్ తో కళ్యాణి ప్రియదర్శని అదరగొట్టింది. రిలీజ్ అయినా తోలి మూడు రోజులకు గాను రూ. 42 కోట్ల గ్రాస్ రాబట్టిన లోక రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. సండే నాటికి 10 రోజులు రన్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 167.51 కోట్ల గ్రాస్ రాబట్టి మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఇండియాలో రూ. 83.61కోట్లు రాగా ఓవర్సీస్ లో రూ. 83.91 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటు తెలుగులోను లోక హిస్టరీ క్రియేట్ చేసే దిశగా వెళుతోంది. తెలుగులో హాయిస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ సినిమాగా నస్లీన్ నటించిన ప్రేమలు రూ. 13. 5 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తెలుగులో రిలీజ్ కు ముందు ఇటుంవటి హడావిడి లేకుండా వచ్చిన లోక 10 రోజులకు గాను రూ. 11 కోట్లు రాబట్టింది. ఇంకో రూ. 2.5 కోట్లు రాబడితే మలయాళ డబ్బింగ్ సినిమాలలో లోక ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే. అటు కేరళలోను లోక ఇండుస్ట్రీ హిట్ దిశగా దూసుకెళ్తోంది.
2 నెలల్లో డబుల్ ట్రీట్ కి సిద్ధమవుతున్న రవితేజ?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానులకు రెండు నెలల వ్యవధిలోనే డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుతున్న మాస్ జాతర చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 27న విడుదల కావాల్సిన మాస్ జాతర, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు టీమ్ అన్ని పనులను వేగవంతం చేస్తూ, అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది. ఇతర విడుదలలు కూడా లాక్ అయ్యి ఉండటంతో, ఈ తేదీనే అనుకూలంగా ఉందని బృందం భావిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. మాస్ జాతర తర్వాత రవితేజ తదుపరి ప్రాజెక్ట్ RT76 (వర్కింగ్ టైటిల్), కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నవంబర్ నాటికి పనులు పూర్తి చేసి, సంక్రాంతి 2026 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బృందం సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇప్పటికే సంక్రాంతి రేసులో MSVP, రాజా సాబ్ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో, ఈ క్లాష్ రవితేజ టీంకు కాస్త సవాల్ కానుంది. పెద్ద హడావుడి నుంచి తప్పించుకుని మరో సరైన తేదీని ఎంచుకుంటే, కలెక్షన్ల పరంగా బలమైన ఫలితం సాధించవచ్చని ట్రేడ్ టాక్. ఇక ఒకే హీరో నుంచి రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలు రావడం చాలా అరుదు. పైగా రవితేజ వంటి మాస్ స్టార్ నుంచి వస్తే, బాక్సాఫీస్ దగ్గర ఫ్యాన్స్‌కి పండగే. సరైన ప్రమోషన్లు, స్ట్రాటజీతో ముందుకెళ్తే రవితేజ ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకోవచ్చు అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.